ఎన్నికలు మొదట్నుంచి ప్రారంభిస్తే ఏమౌతుంది?

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాదు, ఏకంగా రద్దు చేసి ప్రక్రియ మొదట్నుంచీ ప్రారంభించాలి. Advertisement టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాల కోరస్ సాంగ్ ఇది. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్,…

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాదు, ఏకంగా రద్దు చేసి ప్రక్రియ మొదట్నుంచీ ప్రారంభించాలి.

టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాల కోరస్ సాంగ్ ఇది. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్, వామపక్షాల నేతలు నిన్నటి నుంచీ దీనిపై తెగ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. కరోనా దెబ్బతో ఎన్నికలను వాయిదే వేశామని ఎన్నికల కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నారు, అంతేకానీ గొడవలు జరగడం కారణం అని చెప్పలేదు. మరి ఏ కారణంతో ఎన్నికలను తిరిగి నామినేషన్ల నుంచి నిర్వహించాలో ప్రతిపక్షాలే చెప్పాలి.

పోనీ అలాగే చేశారనుకుందాం, అప్పుడేమవుతుంది? అధికార పార్టీ హవా పూర్తిగా తగ్గిపోయి ప్రజలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తారా. 9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి బలంగా వీచింది, అప్పటికీ ఇప్పటికే రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఏమైనా మారాయని అనుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిజంగానే మారాయి. వైసీపీ గెలవని చోట్ల ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఈ 9 నెలల్లో జగన్ పరిపాలన చూసి, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను చూసి.. మిగతా ప్రాంతాల్లో ప్రజలు కూడా వైసీపీకి ఎందుకు ఓటు వేయలేదా అని బాధ పడుతున్నారు. వారంతా స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా జగన్ కి జై కొట్టడం ఖాయం.

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి కూడా ఇంకా చంద్రబాబు, కన్నా, పవన్.. ఎన్నికల విషయంలో రాద్దాంతం చేయడం వారి మూర్ఖత్వం కాక ఇంకోటి కాదు. అయితే వీళ్ల అక్కసుకు కారణం ఒకే ఒక్కటి. ఎలాంటి పోటీ లేకుండా కీలకమైన సెగ్మెంట్స్ అన్నీ ఏకగ్రీవాలు అయిపోవడం వీళ్లకు నచ్చలేదు. అందుకే ఈ రచ్చ. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలనే డిమాండ్ కు ఇదే ప్రధాన కారణం.

స్థానిక ఎన్నికల్లో ఎక్కడయినా అధికార పార్టీకే ప్రజలు అనుకూలంగా ఓట్లు వేస్తారు. సాధారణ ఎన్నికలు మరీ దగ్గరపడితే మాత్రం ఫలితాలు తేడా కొట్టే అవకాశముంది. ఏపీలో నాలుగేళ్లకు పైగా వైసీపీనే పరిపాలించాలి. అలాంటి సందర్భాల్లో స్థానిక ప్రాంతాల అభివృద్ధి నిధుల విషయంలో ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఏకగ్రీవాలన్నీ వీటి ఫలితమే. పోనీ ఏకగ్రీవం కాకపోయినా గెలిచేది వైసీపీ అభ్యర్థులే అన్న విషయం అన్ని జిల్లాల్లోనూ స్పష్టమైంది.

ఓడిపోవడం ఖాయమని తెలిసినప్పుడు, పోటీ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినప్పుడే ఇలాంటి రాద్ధాంతాలకు దూరంగా ఉంటాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. 

చిరంజీవి సినిమా షూటింగ్ ఆపేసారు