ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకుంటూ ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తెలుగుదేశం హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పొందిన లబ్ధి గురించి కూడా కథనాలు వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూతురు నిమ్మగడ్డ శరణ్య అధికారిక పదవినే పొందిందట. ఎలాంటి అర్హత లేకపోయినా.. ఆమెకు ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్ హోదాను ఇచ్చిన వైనం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
అందుకు గానూ నెలకు రెండు లక్షల రూపాయల మేరకు ఆమెకు జీతం ఇచ్చారట. ఇక అప్పట్లో విదేశాల్లో పెట్టుబడులు రాబట్టడానికి అంటూ తిరిగే బ్యాచ్ ఒకటి ఉండేది. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనే కాకుండా.. అవకాశం ఉన్న వాళ్లంతా ప్రపంచాన్ని చుట్టేసి వచ్చి తమ ముచ్చట తీర్చేసుకున్నారు. వారిలో ఈ నిమ్మగడ్డ శరణ్య కూడా ఒకరట. ఏపీ ప్రభుత్వ ఖర్చుతో ఈమె అనేక విదేశాలకు వెళ్లారని, అక్కడ స్టార్ హోటళ్లలో బస, ఇతర విలాసాలు అదనం అని సమాచరాం.
ఆమె విలాసాల గురించి ఏపీ ప్రభుత్వ వర్గాల్లో అప్పట్లోనే చర్చ జరిగేదని తెలుస్తోంది. ఎన్నికల వాయిదా ప్రకటన రాగానే.. నిమ్మగడ్డ శరణ్య వ్యవహారం అంతా సోషల్ మీడియాలో చర్చగా మారింది. చంద్రబాబు నాయుడుపై నిమ్మగడ్డ కుటుంబం ఇలా రుణం తీర్చుకుంటూ ఉందని, ప్రజల సొమ్మును అప్పన్నంగా వాడేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఇలా ఎన్నికలను వాయిదా వేసి మరో ఐదు వేల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వ ఖజానాకు చేరకుండా కూడా అటు జగన్ మీద, ఇటు రాష్ట్ర మీద కసి తీర్చుకుంటోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.