గుత్తాలో ప్రేమ ‘జ్వాల’ ర‌గిల్చిన హీరో అత‌నే…

స్టార్ ష‌ట్ల‌ర్ గుత్తా జ్వాల కేవ‌లం ఆట‌లోనే కాదు మాట‌లో కూడా మేటి అనిపించుకొంది. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఆమె ప‌దునైన మాట‌ల‌ను రాకెట్‌లా వ‌దులుతూ నిత్యం వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంటోంది. ష‌ట్ల‌ర్ ఆట‌కు…

స్టార్ ష‌ట్ల‌ర్ గుత్తా జ్వాల కేవ‌లం ఆట‌లోనే కాదు మాట‌లో కూడా మేటి అనిపించుకొంది. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఆమె ప‌దునైన మాట‌ల‌ను రాకెట్‌లా వ‌దులుతూ నిత్యం వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంటోంది. ష‌ట్ల‌ర్ ఆట‌కు త‌న అంద‌చందాల‌తో గ్లామ‌ర్ అద్ది బ్యాడ్మింట‌న్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ తెచ్చిందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. రెండేళ్లుగా ఆమె ఆట‌కు విరామం ఇచ్చి…కోచ్‌గా స‌రికొత్త అవ‌తార‌మెత్తింది. సొంత అకాడ‌మీ స్థాపించి తీరిక లేకుండా ఆమె గడుపుతోంది. ఇంత బిజీలోనూ ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆమె వెల్ల‌డించింది.  

కెరీర్‌లో ప్రారంభంలో తానుప‌డిన ఇబ్బందుల‌ను ఇప్ప‌టి యువ‌త‌కు రానివ్వ‌కూడ‌ద‌ని భావించే కొత్త అకాడ‌మీ స్టార్ట్ చేసిన‌ట్టు గుత్తా జ్వాల చెప్పారు.  ఈ ఆట‌ను ఎంచుకున్న వ‌ర్త‌మాన క్రీడాకారుల‌కు స‌రైన దిశానిర్దేశం, స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ఆధునిక స‌దుపాయాల‌తో కొత్త అకాడ‌మీని స్థాపించిన‌ట్టు ఆమె తెలిపారు.

త‌న ఆలోచ‌న‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వంతో స‌రైన రీతిలో పంచుకోక‌పోవ‌డం వ‌ల్లే అటు నుంచి స‌హ‌కారం అంద‌లేద‌నుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. అయితే ప్ర‌భుత్వం నుంచి సాయం అందే వ‌ర‌కు ఎదురు చూడ‌డం భావ్యం కాద‌ని త‌న తండ్రి చెప్ప‌డంతో ఇంటిని అమ్మి అకాడ‌మీ ప్రారంభించిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు.

త‌న‌కు అందుబాటులో ఉన్న వనరులతో వంద మందికి శిక్షణ ఇస్తున్న‌ట్టు గుత్తా వెల్ల‌డించారు.  ప్రభుత్వం సాయం చేస్తే భ‌విష్య‌త్‌లో 500 మందికి శిక్షణ ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.  

త‌న‌కు స‌రైన గైడెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఒలింపిక్‌ పతకం సాధించలేకపోయాన‌న్నారు. అయితే డ‌బుల్స్‌లో దేశం త‌ర‌పున తాను గెలిచిన‌న్ని టైటిల్స్ మ‌రే ష‌ట్ల‌ర్ సాధించ‌లేద‌న్నారు. అయితే బ్యాడ్మింట‌న్ కోసం జీవితాన్ని అంకితం చేసిన తాను వ‌ర‌ల్డ్ నెంబ‌ర్‌-6గా ఉన్న‌ప్పుడు ప‌క్క‌న పెట్ట‌డం త‌న మ‌న‌సును తీవ్రంగా క‌ల‌చివేసిన‌ట్టు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని ప్ర‌శ్నించ‌డ‌మే తన నేర‌మైంద‌న్నారు. త‌న‌ను ఆ వ్య‌క్తి టార్గెట్ చేశార‌న్నారు.  

రాజ‌కీయ అంశాల‌పై కూడా గుత్తా జ్వాల త‌న మ‌న‌సులో మాట‌ను వెల్ల‌డించారు. జాతీయ పార్టీల నుంచి పిలుపు వ‌చ్చిన మాట నిజ‌మేన‌న్నారు. అయితే త‌న భావసారూప్య‌త‌కు స‌రిప‌డే పార్టీలు లేవ‌న్నారు. త‌న వ్య‌వ‌హార శైలి ఎవ‌రికీ న‌చ్చ‌ద‌ని ఆమె ఓపెన్‌గా చెప్పారు. అందువ‌ల్ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌న్నారు.  

ఇక త‌న ప్రేమ‌, పెళ్లి గురించి గుత్తా జ్వాల ఏమీ దాచుకోలేదు. త‌మిళ హీరో విష్ణు విశాల్‌, తాను డేటింగ్‌లో ఉన్న‌ట్టు చెప్పారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకోవాల‌నే అంశాన్ని మాత్రం ఇంకా నిర్ణ‌యించుకోలేద‌న్నారు. త్వ‌ర‌లో తాము ఒక్క‌టి కావ‌డం మాత్రం ఖాయ‌మ‌న్నారు. మొత్తానికి గుత్తాలో ప్రేమ ‘జ్వాల’ను ర‌గిల్చిన హీరో త‌మిళ న‌టుడు విష్ణు విశాల్ అన్న‌మాట‌.

ఎలక్షన్ అధికారిపై జగన్ ఫైర్..