ఓ పాన్ ఇండియా సినిమా ప్లీజ్ !

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా క్రేజ్ పట్టుకుంది. చేస్తే పాన్ ఇండియా సినిమానే చేయాలనే ఆలోచనలో వున్నాడట. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. దాని…

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా క్రేజ్ పట్టుకుంది. చేస్తే పాన్ ఇండియా సినిమానే చేయాలనే ఆలోచనలో వున్నాడట. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. దాని తరువాత మైత్రీకి ఓ సినిమా చేయాలి. హీరో సినిమా ఆగిపోయింది. దాని బదులు మరో సినిమా చేయాలి. అయితే అలా చేసే సినిమా పాన్ ఇండియా సినిమా అయి వుండేలా చూడమని మైత్రీ సంస్థ నిర్మాతలను విజయ్ కోరినట్లు తెలుస్తోంది. 

కానీ హీరో సినిమా అనుభవం రీత్యా, ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ మీద చాలా కోట్లు ఖర్చు చేసేసిన రీత్యా, పాన్ ఇండియా సినిమా కాకుండా మామూలు చేద్దామని వారు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఓ సిట్టింగ్ జరిగింది.

ఇదిలావుంటే విజయ్ దేవరకొండ మరో సంస్థను కూడా పాన్ ఇండియా సినిమా కోసం అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ మిత్రుల సంస్థ యువి క్రియేషన్స్ ను విజయ్ దేవరకొండ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు సాహో తీసినట్లుగానే, తనకు ఓ పాన్ ఇండియా సినిమా తీసిపెట్టమని విజయ్ యువి అధినేతలను కోరినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద విజయ్ దేవరకొండకు తెలుగు సినిమా మీద కన్నా బాలీవుడ్ సినిమా మీద మోజు బాగానే పెరిగినట్లు కనిపిస్తోంది.

నేను గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది