తెలంగాణ ప్రాంతంలో థియేటర్లు ఈ నెల 31 వరకు బంద్ అంటూ నిన్నటికి నిన్న వార్తలు వినిపించాయి. దీంతో 25న విడుదల కావాల్సిన రెండు సినిమాలు డీలా పడ్డాయి. రెండు సినిమాలు చిన్న సినిమాలే అయినా పోటాపోటీగా మంచి ప్రచారం చేసాయి. రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా, ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రాలు రెండూ 25న విడుదల కావాల్సి వుంది.
అయితే లేటెస్ట్ సంగతి ఏమిటంటే, మాల్స్ థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ కు సెలవులు ప్రకటిస్తూ జిహెచ్ఎమ్ సి ఇచ్చిన ఆదేశాలు బయటకు వచ్చాయి. ఈ ఆదేశాల ప్రకారం చూస్తే థియేటర్ల సెలవులు 21 వరకే అని స్పష్టం అవుతోంది. మరి ఆ లెక్కన 25న సినిమాలు విడుదల కావడానికి అంతగా అడ్డంకులు వుండకపోవచ్చు.
అయితే థియేటర్లకు జనం వస్తారా? రారా అన్నది మాత్రం చూడాలి. నిజానికి మాల్స్ లేక, సినిమాలు లేక, క్రికెట్ లేక జనం అల్లాడిపోయే అవకాశం వుంది. అలాంటపుడు వచ్చిన సినిమా ఏ మాత్రం బాగున్నా హిట్ అయిపోయే అవకాశమూ వుంది.