మానవహక్కుల ఉల్లంఘన అంటే ఏంటి ? బాబు కామెడీ

వినేవాడు ఉండాలి కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటిపోతాయి. నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడేస్తుంటారు బాబు. తాజాగా ఆయన నోటి నుంచి మరో ఆణిముత్యం జాలువారింది. తన హయాంలో మానవ హక్కుల ఉల్లంఘన అస్సలు జరగలేదని,…

వినేవాడు ఉండాలి కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటిపోతాయి. నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడేస్తుంటారు బాబు. తాజాగా ఆయన నోటి నుంచి మరో ఆణిముత్యం జాలువారింది. తన హయాంలో మానవ హక్కుల ఉల్లంఘన అస్సలు జరగలేదని, జగన్ పాలనలో మాత్రం అడుగడుగునా ఉల్లంఘన జరుగుతోందంటూ జూమ్ సాక్షిగా బురదజల్లే ప్రయత్నం చేశారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు వినేవాడు ఉండాలే కానీ మహాభారతం కూడా తానే రాశానని చెప్పుకునే ఘనుడు ఈ చంద్రబాబు. అసలు మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందే చంద్రబాబు హయాంలో. హక్కుల్ని కాలరాయడంలో బాబు ఎప్పుడో పీహెచ్ డీ చేశారు. దానికి సంబంధించి ఇదిగో సాక్ష్యాలంటూ వైసీపీ నేతలు లెక్కలేనన్ని ఉదాహరణలు తీస్తున్నారు. తీసేకొద్ది బాబు హయాంలో జరిగిన ఉల్లంఘటనల దొంతరలు బయటకొస్తూనే ఉన్నాయి.

మచ్చుకు కొన్ని చెప్పుకుందాం.. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వందలాది మంది మేధావులు, విద్యార్థులపై కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుది. “హోదా అంటే జైలుకే” అంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చిన పెద్దమనిషి ఈయన. మానవ హక్కుల ఉల్లంఘనకు ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేం కావాలి.

అంతెందుకు.. 2015లో బాబు హయాంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదా? 20 మంది తమిళనాడు కూలీల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తే జాతీయ కమిషనే ఉలిక్కిపడింది. 

ఇక 2017లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పార్క్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన ఓ మహిళను 54 రోజుల పాటు నిర్బంధించాడు బాబు. కనీసం ఎక్కడుందో కూడా చెప్పలేదు. అదే టైమ్ లో పదుల సంఖ్యలో ఉద్యమకారులపై కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లో ఉంచారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదా?

ఓసారి పబ్లిక్ గా, మీడియా ముందు “దళితుడిగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటాడా” అంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మరోసారి అందర్లో నాయీ బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తానంటూ కళ్లెర్రజేశారు. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు హయాంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘటనలు లెక్కలేనన్ని బయటపడతాయి.

ఇలా తన వెనక ఇంత నీచ చరిత్ర పెట్టుకున్న బాబు.. ఇప్పుడు రఘురామ అరెస్ట్ ఎపిసోడ్ లో మాత్రం ఏమీ ఎరగనట్టు మానవ హక్కులపై ప్రసంగాలు ఇస్తున్నారు. దానికి ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం కల్పిస్తోంది.