అందుకే కీర్తిసురేష్ పీక పట్టుకున్నాను – చిరంజీవి

'చిరు లీక్స్' లో భాగంగా భోళాశంకర్ నుంచి ఆమధ్య ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. వీడియో అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఓ సీన్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.…

'చిరు లీక్స్' లో భాగంగా భోళాశంకర్ నుంచి ఆమధ్య ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. వీడియో అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఓ సీన్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అదేంటంటే.. చిరంజీవి కోపంగా కీర్తిసురేష్ పీక పట్టుకుంటారు. అది సినిమాలో సన్నివేశం కాదనే విషయం వీడియో చూస్తే అర్థమౌతుంది. మరి ఎందుకు చిరంజీవికి అంత కోపం వచ్చింది?

ఎట్టకేలకు ఆ సందర్భంపై స్పందించారు చిరంజీవి. భోళాశంకర్ లో చిరంజీవి చెల్లెలిగా నటించింది కీర్తిసురేష్. ఆమెకు ప్రతి రోజూ చిరు ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఓ టైమ్ లో భోజనంకు సంబంధించి కీర్తిసురేష్ ఇబ్బంది పెట్టడంతో సరదాగా ఆమె పీక పట్టకున్న విషయాన్ని చిరు బయటపెట్టారు.

“మా ఇంట్లో తమిళ వంటమనిషి ఉన్నాడు. కీర్తిసురేష్ కు కావాల్సిన భోజనం అతడే వండి పంపించేవాడు. ప్రతి రోజూ చాలా వెరైటీలు తినేది. తిన్నది తక్కువే అయినా అన్నీ ఎంజాయ్ చేసేది. ఒక్కోసారి ఏం కావాలో డిమాండ్ చేసేది. ఇంకోసారి ఉప్పు, కారం తగ్గితే తిప్పి పంపించేది. మళ్లీ సరిగ్గా చేసి తీసుకురమ్మనేది. ఓసారి షూటింగ్ లో హడావుడిగా ఉన్న టైమ్ లో నా దగ్గరకొచ్చి రేపు మెనూ ఏంటని అడిగింది. ఒక్కసారిగా కోపమొచ్చి పీక పట్టుకున్నాను. ఆ టైమ్ లో తీసిన షాట్ అది.”

ఇలా షూటింగ్ టైమ్ లో జరిగిన సరదా సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. తమన్న మాత్రం తన ఇంటి భోజనం తినేది కాదని, తన భోజనం ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు చిరు.