నెట్ లో బెజవాడ అమ్మాయిల నగ్న చిత్రాలు

సైబర్ నేరాలు ఎన్నో రకాలు. కొందరు ఎకౌంట్ సమాచారం కాజేసి డబ్బులు కొట్టేస్తే, మరికొందరు నకిలీ కాల్స్ తో మోసం చేస్తుంటారు. ఇది మరో రకమైన మోసం. అమ్మాయిల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి, వాళ్ల…

సైబర్ నేరాలు ఎన్నో రకాలు. కొందరు ఎకౌంట్ సమాచారం కాజేసి డబ్బులు కొట్టేస్తే, మరికొందరు నకిలీ కాల్స్ తో మోసం చేస్తుంటారు. ఇది మరో రకమైన మోసం. అమ్మాయిల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి, వాళ్ల ముఖాలతో నగ్నంగా ఉండే ఫొటోలు తయారుచేసి, వాటిని ఆన్ లైన్లో అమ్ముతున్నాడు ఓ నీచుడు. దాదాపు 6 నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు.

విజయనగరంకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి విజయవాడలో సీఏ చదువుతున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇతగాడు… సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫొటోల్ని డౌన్ లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ ద్వారా నగ్న చిత్రాలుగా మారుస్తున్నాడు. వాటిని తన ఎకౌంట్ లో పెట్టి.. ఫొటోను 300 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. ఇలా రోజుకు 5-6 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.

ఒకరోజు బంజారాహిల్స్ కు చెందిన ఓ అమ్మాయి ఇలానే తన ఫొటోను సోషల్ మీడియాలో చూసి అవాక్కయింది. తను నగ్నంగా ఉన్న ఫొటో తన కంట పడేసరికి ఆ అమ్మాయి షాక్ అయింది. వెంటనే వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అలా తీగ లాగితే డొంక కదిలింది. వెంకటేష్ ఆగడాలు మొత్తంగా బయటపడ్డాయి.

విజయవాడకు చెందిన ఎంతోమంది అమ్మాయిల పొటోల్ని ఇలా మార్ఫింగ్ చేసి అమ్మేశానని పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు వెంకటేష్. అలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్ వెళ్లి పబ్ లో ఎంజాయ్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతడు ఊచలు లెక్కబెడుతున్నాడు.

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లో అమ్మాయిలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫొటోలు పెడుతుంటారు. వాటికొచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోతుంటారు. అయితే ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయని విషయాన్ని అమ్మాయిలు గ్రహించాలి. తమ ప్రమేయం లేకపోయినా ఇలాంటి ఘటనల వల్ల పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

నేను గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..