ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసింది. శనివారంతో అది పూర్తి కావడంతో… ఏకగ్రీవంగా ఎన్నికల ఘట్టం పూర్తి అయిన స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది.
-అనంతపురం జిల్లాలో 49 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా విజయం సాధిస్తే, ఇదే జిల్లాలో ఒక్క స్థానంలో తెలుగుదేశం ఏకగ్రీవంగా నెగ్గింది. ఈ జిల్లాలో జడ్పీ సీట్ల విషయంలో ఎక్కడా ఏకగ్రీవాలు జరగలేదు.
-నెల్లూరు జిల్లాలో 183 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను ఏకగ్రీవంగా నెగ్గింది. జడ్పీటీసీ విషయానికి వస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 జడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంది.
-విశాఖ జిల్లాలో 32ఎంపీటీసీ స్థానాలనూ, 1 జడ్పీ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. ఇక్కడ ఇంకా టీడీపీ ఖాతా తెరవలేదు.
-పశ్చిమ గోదావరి జిల్లాలో 67 ఎంపీటీసీలను వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గగా, టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని సొంతం చేసుకుంది. వైసీపీ రెండు జడ్పీటీసీ స్థానాలను కూడా నెగ్గింది.
-తూర్పుగోదావరి జిల్లాలో 60 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ నెగ్గగా, జడ్పీ స్థానాలేవీ ఏకగ్రీవం కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 66 ఎంపీటీసీలను వైసీపీ సొంతం చేసుకుంది.
-కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 287 ఎంపీటీసీ స్థానాలను, 16 జడ్పీసీట్లను సోలోగా సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 14 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా నెగ్గింది.
-చిత్తూరు జిల్లాలో 323 ఎంపీటీసీలను వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకోగా, టీడీపీ 19 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా నెగ్గింది. 29 జడ్పీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నెగ్గింది.
-వైఎస్ఆర్ జిల్లాలో 386 ఎంపీటీసీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నెగ్గింది. టీడీపీ 10 ఎంపీటీసీ స్థానాలను ఇక్కడ సొంతం చేసుకుంది. 38 జడ్పీటీసీ సీట్లను ఇక్కడ వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది.
-గుంటూరు జిల్లాలో 267 ఎంపీటీసీ సీట్లను వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. ఒక్క సీటును టీడీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. ఎనిమిది జడ్పీటీసీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నెగ్గింది.
-కృష్ణా జిల్లాలో 68 ఎంపీటీసీ సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నాయి. రెండు జడ్పీల్లో వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది.
-విజయనగరం జిల్లాలో 55 ఎంపీటీసీ సీట్లను , మూడు జడ్పీ సీట్లను వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో 286 ఎంపీటీసీ సీట్లను, 14 జడ్పీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నెగ్గింది. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో 32 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా నెగ్గింది.