ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత!

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసం విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు.  Advertisement గద్దర్ అసలు…

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసం విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. 

గద్దర్ అసలు పేరు విఠల్ రావు. అందరికీ గద్దర్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో 1949లో ఆయన జన్మించారు. కొన్ని రోజుల కిందట ఆయన గుండె సంబంధిత రుగ్మతతో బాధపడుతూ ఆపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు. కోలుకుంటున్నానని ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

గద్దర్ అంటే తెలంగాణలో తెలియని వారుండరు. దశాబ్దాల పాటు విప్లవ రాజకీయాల్లో తన ఆట పాటలతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలు ఊగించి ఎంతో మంది యువతను విప్లవ రాజకీయాలు, విప్లవ పార్టీల వైపు ఆకర్షించారు.