పుష్పలో మరో హీరోయిన్?

బన్నీ-సుకుమార్ కాంబోలో మైత్రీ సంస్థ నిర్మించే పుష్ప సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా విడగొట్టాలి అనుకున్నారో, చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు బోగట్టా.  Advertisement సినిమా సబ్జెక్ట్ చాలా అంటే చాలా పెద్దది కావడం…

బన్నీ-సుకుమార్ కాంబోలో మైత్రీ సంస్థ నిర్మించే పుష్ప సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా విడగొట్టాలి అనుకున్నారో, చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు బోగట్టా. 

సినిమా సబ్జెక్ట్ చాలా అంటే చాలా పెద్దది కావడం వల్లే ఇలా రెండు భాగాలు చేస్తున్నారు అని నిర్మాతల వైపు నుంచి టాక్. కానీ అసలు అంత కథ లేదు, దాన్ని రెండు భాగాలు ఎలా చేస్తారో అని యూనిట్ వర్గాల టాక్.

అయితే మలిభాగంలో ఎలాగూ పాటలు పెట్టాలి, ఫైట్లు పెట్టాలి కాబట్టి ఆ మేరకు కొంత గ్యాప్ ఫిల్లింగ్ సులువే. అయితే ఇప్పటి వరకు అనుకున్న రష్మిక కాకుండా మలిభాగంలో మరో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేసే పని ఇప్పుడు దర్శకుడు సుకుమార్ పెట్టుకున్నారన్న గ్యాసిప్ వినిపిస్తోంది.

ఎర్రచందనం కూలీ ఓ మాఫియా డాన్ గా ఎదిగిన తరువాత రెండో భాగం మొదలవుతుందని, తొలిభాగం రగ్డ్ గా రఫ్ గా వుంటే, మలి భాగం అల్ట్రా స్టయిలిష్ గా వుంటుందని, ఇందుకోసం ఆ రేంజ్ హీరోయిన్ కు సూటయ్యే పాత్రను జోడిస్తున్నారని టాక్.

ఇవన్నీ గ్యాసిప్ లేనా, నిజాలా? అన్నది తెలియాలంటే కొంత టైమ్ పడుతుంది. రెండు భాగాలు అనుకున్నపుడు గ్యాసిప్ అనుకున్నారు. అదే నిజమైంది. 

ఇప్పుడు మరో హీరోయిన్ అన్నది కూడా అదే దారిలో వెళ్తుందేమో? అయితే తొలిభాగం పూర్తయిన తరవాత సంగతి కాబట్టి, రెండో హీరోయిన్ విషయంలో క్లారిటీ రావడానికి కాస్త టైమ్ పడుతుంది.