మ‌హారాష్ట్ర‌కు ద‌క్కుతున్న కోవిడ్ ఉప‌శ‌మ‌నం…

మే ద్వితీయార్థం నుంచి దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌న్న అంచ‌నాల‌కు అనుగుణంగా న‌మోద‌వుతున్నాయి రోజువారీ క‌రోనా కేసుల నంబ‌ర్లు. ప్ర‌త్యేకించి క‌రోనా క‌ల్లోలంతో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ మ‌హారాష్ట్ర‌లో కొత్త కేసుల…

మే ద్వితీయార్థం నుంచి దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌న్న అంచ‌నాల‌కు అనుగుణంగా న‌మోద‌వుతున్నాయి రోజువారీ క‌రోనా కేసుల నంబ‌ర్లు. ప్ర‌త్యేకించి క‌రోనా క‌ల్లోలంతో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ మ‌హారాష్ట్ర‌లో కొత్త కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో ఈ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోందనే అభిప్రాయాల‌కు ఆస్కారం ఏర్ప‌డుతూ ఉంది. 

ఒక ద‌శ‌లో దాదాపు ఆరు ల‌క్ష‌ల యాక్టివ్ కేసుల‌తో అల్లాడిన మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడున్న యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు 4.19 ల‌క్ష‌లు. రోజువారీగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య కంటే రెట్టింపు స్థాయిలో రిక‌వ‌రీలు న‌మోద‌వుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల లోడ్ త‌గ్గుతూ ఉంది. ఆసుప‌త్రుల‌పై భారం త‌గ్గుతూ ఉంది.

ముంబైలో ఒక రోజులో 953 కేసులు న‌మోద‌య్యాయి. బ‌హుశా చాన్నాళ్ల త‌ర్వాత ఆ మ‌హాన‌గ‌రంలో వెయ్యికి లోపు కేసులు న‌మోదు కావ‌డం ఊర‌ట‌ను ఇచ్చే అంశం. ప్రస్తుతం అక్క‌డ యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేల వ‌ర‌కూ ఉంద‌ట‌.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఇండియాలో క‌రోనా సెకెండ్ వేవ్ బాగా వ్యాపించింది మ‌హారాష్ట్ర‌లోనే. మార్చి నెల నుంచినే అక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ వ‌చ్చింది. మిగ‌తా దేశం సెకెండ్ వేవ్ ను సీరియ‌స్ గా తీసుకునే లోగానే మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య ప‌తాక స్థాయికి వెళ్లాయి. 

దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ న‌మోదు కానీ రీతిలో అత్యంత భారీ స్థాయిలో అక్క‌డ కేసులు న‌మోద‌వుతూ వెళ్లాయి. ఇప్పుడు త‌గ్గుముఖం కూడా ముందుగా మహారాష్ట్రలోనే చెప్పుకోద‌గిన స్థాయిలో న‌మోద‌వుతూ ఉన్న‌ట్టుంది.