నితిన్, నవదీప్ ఇలా డబ్బున్న కుర్రాళ్లను హీరోగా పరిచయం చేయడం అన్నది డైరక్టర్ తేజ స్పెషాలిటీ. ఫస్ట్ సినిమా అంటే రామోజీ నిర్మాత కాబట్టి ఆ అవసరం లేకపోయింది.
తరువాత తను నిర్మించిన కొత్త హీరోల సినిమాలకు పెట్టుబడులు కొంతయినా అటు నుంచి రావాల్సిందే అని ఇండస్ట్రీ టాక్. రీసెంట్ గా ఓ సబ్జెక్ట్ రెడీ చేసాడు. దానికి హీరో కావాలి.
ఎన్టీఆర్ బావమరిది, నార్నేకుర్రాడుతో అంతా ఫైనల్ అనుకున్నారు. డబ్బుల పెట్టుబడి దగ్గర తేడా వచ్చేసింది. అంత మొత్తం తాము పెట్టుబడి పెట్టలేమన్నారు. దాంతో మళ్లీ మరో హీరో కోసం వేట మొదలైంది.
ఎవరూ దొరక్క పోతే, తనే పెట్టాల్సి వస్తే, తన కొడుకును హీరోగా పరిచయం చేసే ఆలోచనలో తేజ వున్నారనే టాక్ కూడా వుంది.
లేటెస్ట్ గా సురేష్ బాబు తనయుడు అభిరామ్ ను కూడా ట్రయ్ చేస్తున్నాడని టాక్.కానీ సురేష్ బాబు పెట్టుబడి పెడతారా? అన్నది అనుమానం.
ఒకవేళ పెట్టాల్సి వచ్చినా ముఫై మూడు కండిషన్లు, అరవైఆరు స్క్రిప్ట్ మార్పులు వుంటాయి. అవన్నీ ఇప్పట్లో తెమిలే వ్యవహారాలు కావు. వెంకీతో సినిమా అన్నదే కోల్డ్ స్టోరేజ్ లో వుండిపోయింది.
అందువల్ల తేజ ఎప్పటికైనా తన కథతో తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడమే అనివార్యమేమో?