హరి హరా….హరిహర

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లోని రాబిన్ హుడ్ టైప్ జానపద సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా ఇక ఇప్పట్లో విడదల కావడం కష్టం అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. …

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లోని రాబిన్ హుడ్ టైప్ జానపద సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా ఇక ఇప్పట్లో విడదల కావడం కష్టం అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

దసరా నుంచి ఇకపై రోడ్ల మీదే వుంటాను పవన్ కళ్యాణ్ ప్రకటించేసారు. మరోపక్క దసరా లోగా తన కొత్త సినిమా ఫినిష్ చేయాలనుకుంటున్నారు. అందువల్ల హరి హర వీరమల్లు సినిమాను తాత్కాలికంగానో, శాశ్వతంగానో పక్కన పెట్టేసినట్లే అనుకోవాలి. 

నిజానికి ఈ సినిమాను పూర్తి చేయాలి అన్న ఆలోచన పవన్ కు వుంటే ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ముందుగా ఆ సినిమా మీదే కిందా మీదా పడి వర్క్ చేయాల్సి వుంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి సముద్రఖని కాంబినేషన్ లో సినిమాను టేకప్ చేయడం అంటే పవన్ మదిలో ఈ సినిమా మీద ఆసక్తి తగ్గింది అనే గ్యాసిప్ లు నిజమనుకోవాలి.

ఈ సినిమాకు చాలా ఫైట్లు, పాటలు బకాయి వున్నాయి అని, పవన్ అవి చేయడానికి అంత సుముఖంగా లేరని కూడా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై దర్శకుడు క్రిష్ తో డిస్కస్ చేసారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద హరిహర వీరమల్లు విషయంలో ఏదో జరిగింది. మరి ఇక ఏం జరగబోతోందన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు. 

కానీ సినిమా అయితే మాత్రం ఇప్పట్లో బయటకు వస్తుందా? అన్నది అనుమానమే. పవన్ ఎండ అనక, వాన అనక ఆరు నెలలు బయట తిరిగితే ఆయన లుక్ పరిస్థితి ఏమిటి? అన్నది కూడా అంచనా వేసుకోవాల్సి వుంటుంది. 

సీనియర్ నిర్మాత ఇప్పటికే ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో వున్నారని వార్తలు వున్నాయి. ఇక ఈ సినిమా కనక బయటకు రాకపోతే ఆయన పరిస్థితి ఏమిటో?