నామినేషన్లకు ముందే చేతులెత్తేసిన టీడీపీ !

విశాఖ మేయర్ మాదే అని జబ్బలు చరచుకున్న టీడీపీ ముందే చతికిలపడిపోయింది.  ఓవైపు నామినేషన్ల స్వీకరణకు  గడువు ముగిసింది. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్ మాత్రం బయటకు రాలేదు. ఇదీ ఫార్టీ…

విశాఖ మేయర్ మాదే అని జబ్బలు చరచుకున్న టీడీపీ ముందే చతికిలపడిపోయింది.  ఓవైపు నామినేషన్ల స్వీకరణకు  గడువు ముగిసింది. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్ మాత్రం బయటకు రాలేదు. ఇదీ ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ తెలుగుదేశం పార్టీ తీరు. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచేస్తామని ఓ వైపు బీరాలు పలుకుతోంది. మరో వైపు అభ్యర్ధుల ఎంపిక కూడా పూర్తి చేయలేని నిస్సహాయతతో ఉంది.

అనీ అమరావతి నుంచే. వడపోతలూ, కూడికలూ, తీసివేతలూ అన్నీ అక్కడ నుంచేనట. ఓ వైపు వైసీపీ అభ్యర్ధుల లిస్ట్ మొత్తం రిలీజ్ అయింది. ఆ పార్టీ అభ్యర్ధులు మొత్తానికి మొత్తం నామినేషన్లు వేసేశారు. కానీ పచ్చ పార్టీ అభ్యర్ధులు ఎవరో తేలక నానా గందరగోళంలో తమ్ముళ్ళు ఉన్నారు.

మూడు రాజధానులు, పాలనా వికేంద్రీకరణ జగన్ సిధ్ధాంతం. అందుకే వైసీపీ అభ్యర్ధుల లిస్ట్ విశాఖలోనే రెడీ అయిపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదే టీడీపీకి ఒకటే రాజధాని, అన్నీ అమరావతి  అక్కడే కాబట్టి ఇంకా కేంద్రీక్రుత విధానాలే అనుసరిస్తున్నారని తమ్ముళ్ళు మండిపడుతున్నారు.

ఒక్క టీడీపీ విషయమే కాదు, జనసేన, బీజేపీ అభ్యర్ధుల జాబితా కూడా ఇంకా విడుదల చేయకపోవడం విశేషం. నామినేషన్ స్వీకరణకు గడువు ముగీనా ఇంకా ఆయా పార్టీల శిబిరాలో కీచులాటలు పడుతూండడం బట్టి చూస్తూంటే అసలు ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్నారంటున్నారు.

కేటీఆర్ వైరల్ వీడియో..

నేను రవితేజ అనుష్క కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం