ఎంత మందితో తిరిగితే నీకేంటి – నేహా ధూపియా

నటి నేహా ధూపియా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోడీస్ రివల్యూషన్ అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నేహాధూపియా.. అమ్మాయిలన్ని వెనకేసుకొస్తున్నాననే భ్రమలో మహిళా జాతినే కించపరిచేలా వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.…

నటి నేహా ధూపియా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోడీస్ రివల్యూషన్ అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నేహాధూపియా.. అమ్మాయిలన్ని వెనకేసుకొస్తున్నాననే భ్రమలో మహిళా జాతినే కించపరిచేలా వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే..

కార్యక్రమంలో ఓ కుర్రాడు తన బాధను నేహాతో పంచుకున్నాడు. తన ప్రేయసి తనతో ప్రేమలో ఉంటూనే, మరో ఐదుగురు అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకుందని చెప్పుకొచ్చాడు. ఆ బాధ తట్టుకోలేక తను తన గర్ల్ ఫ్రెండ్ ను చెంప దెబ్బ కొట్టానని అన్నాడు. దీంతో నేహాధూపియా ఫైర్ అయింది. మహిళను అలా ఎలా కొడతావంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమె ఐదుగురుతో డేటింగ్ చేయడం అనేది ఆమె వ్యక్తిగత విషయమని స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

నేహా స్టేట్ మెంట్ తో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. నెటిజన్లయితే భగ్గుమన్నారు. ఇదేం ఫెమినిజం తల్లి అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాయ్ ఫ్రెండ్ ఉండగా… మరో ఐదుగురితో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయిని వెనకేసుకురావడం ఏంటని గట్టిగా ప్రశ్నించారు. నేహా ధూపియాకు బ్రెయిన్ చెడిందని ఇంకొందరు సెటైర్లు వేశారు.

ఓ అమ్మాయి నలుగురు అబ్బాయిల్ని కొడితే నేహా ధూపియాకు సంతోషమని, అదే తప్పుచేసిన ఓ అమ్మాయిని ఓ అబ్బాయి కొడితే మాత్రం నేహాధూపియాకు నచ్చదని కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలానే చేశావా అంటూ కాస్త ఘాటుగానే అక్కడక్కడ కామెంట్స్ పడ్డాయి.

నేను రవితేజ అనుష్క కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం

కేటీఆర్ వైరల్ వీడియో..