ఇవిగో ఆధారాలు… అడ్డంగా దొరికిన అయ్యన్న…?

మా అయ్యన్న మా మంచి వాడు అని ఒక వైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు అంతా ఒక్కటే తీరుగా మాట్లాడుతున్నారు, ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక అయ్యన్న ఫ్యామిలీ అయితే తాము…

మా అయ్యన్న మా మంచి వాడు అని ఒక వైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు అంతా ఒక్కటే తీరుగా మాట్లాడుతున్నారు, ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక అయ్యన్న ఫ్యామిలీ అయితే తాము ఎలాంటి ఆక్రమణలు పాల్పడలేదని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అని కూడా అంటున్నారు.

అయితే కక్ష కాదు ఆక్రమణలు పాల్పడినందుకు ఇది శిక్ష అని ఏకంగా నీటిపారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. అయ్యన్న తన ఇంటిని నిర్మించుకోవడం కోసం పది అడుగులకు పైగా కాలువ భూమిని సర్కార్ భూమిని ఆక్రమించారని కూడా స్పష్టం చేస్తూ తాజాగా ఆధారాలను బయటపెట్టడంతో ఇపుడు సీన్ మారింది.

తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు కాలువను ఆక్రమించాడంటూ నీటిపారుదల శాఖ అధికారులు వివరాలను మీడియాకు వెల్లడించారు. వారు అందించిన నివేదికల ప్రకారం రావణపల్లి రిజర్వాయర్ కాలువకు నీటిపారుదల శాఖ భద్రతా గోడను నిర్మించింది. ఇప్పుడు ఆ కాలువ గోడలపై అయ్యన్న పాత్రుడు నేలమాళిగను నిర్మించినట్లు అధికారులు ధృవీకరించారు.

అలాగే అయ్యన్న పాత్రుడు ఇంటి నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడు తన నివాసం కోసం 10 అడుగుల కాలువ భూమిని ఆక్రమించారని నీటిపారుదల శాఖ అధికారులు ఆరోపించారు. ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ అయ్యన్న పాత్రుడు నివాసం కాంపౌండ్ వాల్‌ను మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో నర్శీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.

అయితే అయ్యన్న శుద్ధ పూస అని ఆయనకు ఏమీ తెలియదు అని టీడీపీ చంద్రబాబు వెనకేసుకుని వస్తున్నారు. ఆయన ఈ మేరకు జగన్ సర్కార్ మీదనే నిప్పులు చెరుగుతున్నారు. అయ్యన్న విమర్శలకు జవాబు చెప్పలేకనే వైసీపీ పెద్దలు ఇలా చేశారు అని కూడా ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో రంగంలోకి దిగిన నీటిపారుదల శాఖ అధికారులు ఇది పూర్తిగా ఆక్రమణ భూమిలో అయ్యన్న ఇంటి గోడలు నిర్మించారు అని తేల్చడంతో ఇపుడు టీడీపీ ఏం జవాబు చెబుతుంది అని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అయితే అయ్యన్న ఆక్రమణలు చేస్తూంటే బీసీ నేత అని వదిలేయాలా అని ప్రశ్నించారు. ఆ మాటకు వస్తే తామూ బీసీ నేతలమే అని ఆయన అంటున్నారు. చట్టం ముందు ఎవరు తప్పు చేసినా నిలబడాల్సిందే అని కూడా ఆయన చెబుతున్నారు.