‘వక్కంతం’ కు రవితేజ గ్రీన్ సిగ్నల్

రచయిత కమ్ దర్శకుడు వక్కంతం వంశీకి మాస్ హీరో రవితేజకు మధ్య మాంచి అనుబంధం వుంది. కిక్ అనే సినిమా రవితేజ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. వక్కంతం వంశీ కూడా అక్కడి…

రచయిత కమ్ దర్శకుడు వక్కంతం వంశీకి మాస్ హీరో రవితేజకు మధ్య మాంచి అనుబంధం వుంది. కిక్ అనే సినిమా రవితేజ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. వక్కంతం వంశీ కూడా అక్కడి నుంచే స్టార్ రైటర్ అయిపోయారు. అయితే అక్కడి నుంచి డైరక్షన్ దిశగా వెళ్లినపుడు కూడా మాస్ మహరాజాతో ఒక సినిమా వుంటుందని ఎప్పటికప్పుడు వినిపిస్తూనే వుంది. కానీ అది మెటీరియలైజ్ కాలేదు.

ఈలోగా బన్నీతో నా పేరు సూర్య చేసాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి బన్నీ క్యాంప్ లోనే వుంటూ కథలు తయారు చేసే పనిలో వున్నారు వక్కంతం. ఇన్నాళ్లకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లున్నాయి. వక్కంతం చెప్పిన స్క్రిప్ట్ విని హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

రవితేజ చాలా స్పీడుగా సినిమాలు ఓకె చేస్తున్నారు. గోపీచంద్ మలినేనితో క్రాక్ చేస్తూనే రమేష్ వర్మ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈలోగా నక్కిన త్రినాధరావు కూడా లైన్ లోకి వచ్చారు. ఇప్పుడు వక్కంతం వంశీ బౌండ్ స్క్రిప్ట్ తో రావడంతో ఆయన కూడా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే నిర్మాత ఎవరు? అన్న క్వశ్చను అలాగే వుంది. వక్కతం దగ్గర రెండు మూడు అడ్వాన్స్ లు వున్నాయి. వారిలో ఎవరికో ఒకరికి ఈ సినిమా వుంటుందని బోగట్టా.

కేటీఆర్ వైరల్ వీడియో..

నాకు స్వయంవరం అంత అవసరమా ?