దొరబాబు కెరీర్ కు ఢోకా లేనట్టే!

ఊహించని విధంగా హైటెక్ వ్యభిచారం రాకెట్ లో పట్టుబడ్డాడు దొరబాబు. దీంతో అతడి కెరీర్ పై అందరూ అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఒక్క దెబ్బతో దొరబాబు కెరీర్ క్లోజ్ అంటూ అతడి ప్రత్యర్థులు కూడా…

ఊహించని విధంగా హైటెక్ వ్యభిచారం రాకెట్ లో పట్టుబడ్డాడు దొరబాబు. దీంతో అతడి కెరీర్ పై అందరూ అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఒక్క దెబ్బతో దొరబాబు కెరీర్ క్లోజ్ అంటూ అతడి ప్రత్యర్థులు కూడా పండగ చేసుకున్నారు. కానీ దొరబాబు కెరీర్ కు ఢోకా లేదని తేలిపోయింది. అతడు ఎప్పట్లానే జబర్దస్త్ స్కిట్స్ లో కనిపిస్తున్నాడు.

విశాఖలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మాధవధారలో హైటెక్ సెక్స్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో దొరబాబు దొరికిపోయాడు. అప్పట్నుంచి అతడి కెరీర్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే టీమ్ లీడర్ హైపర్ ఆది మాత్రం దొరబాబును వెనకేసుకొచ్చాడు. అతడ్ని మళ్లీ టీమ్ లో కొనసాగేలా మల్లెమాల మేనేజ్ మెంట్ తో మాట్లాడి సెట్ చేశాడు.

నిజానికి దొరబాబును జబర్దస్త్ నుంచి తొలిగించాలని అనుకున్నది నిజం. అయితే అదే జరిగితే అతడ్ని తన వైపు లాక్కోవాలని నాగబాబు చాలా ఎదురుచూశారు. జబర్దస్ట్ నుంచి దొరబాబు బహిష్కరణ జరిగితే, అతడు వెంటనే జీ తెలుగులో వస్తున్న అదిరింది అనే కార్యక్రమం (జబర్దస్త్ కు జిరాక్స్)లో ప్రత్యక్షమయ్యేవాడు. ఈ ప్రమాదం ఉందని తెలిసే దొరబాబు వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేసింది మల్లెమాల మేనేజ్ మెంట్.

మొత్తమ్మీద జబర్దస్త్ స్కిట్స్ లో దొరబాబు మళ్లీ కనిపించడంతో ఈ విషయానికి ఇక్కడితో తెరపడింది. అన్నట్టు దొరబాబుతో పాటు దొరికిపోయిన పరదేశి అనే మరో కంటెస్టెంట్ కు కూడా లైఫ్ లైన్ దొరికేసింది. 

బాబుకి దెబ్బ మీద దెబ్బ

నాకు స్వయంవరం అంత అవసరమా ?