వకీల్ సాబ్ రైజింగ్.. జనసేనానిపై ట్రోలింగ్

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదలైన రోజు సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో చూశాం. లిరికల్ సాంగ్ విడుదలయ్యాక ఆ రేంజే వేరన్నట్టు రికార్డుల పేరుతో మరింత రెచ్చిపోయారు. ఇదంతా…

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదలైన రోజు సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో చూశాం. లిరికల్ సాంగ్ విడుదలయ్యాక ఆ రేంజే వేరన్నట్టు రికార్డుల పేరుతో మరింత రెచ్చిపోయారు. ఇదంతా సినీ అభిమానం. మరి అదే పవన్ కల్యాణ్ కాస్త గ్యాప్ తీసుకుని జనసేనానిగా జనం ముందుకు వస్తే మాత్రం ఎందుకో అంతగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.

బీజేపీతో కలసి పవన్ ప్రెస్ మీట్ పెట్టగానే.. సోషల్ మీడియాలో విపరీతంగా నెగెటివ్ కామెంట్లు పడ్డాయి. పవన్ ని, ఏపీ బీజేపీ నేతల్ని నెటిజన్లు ట్రోల్ చేశారు. వీటన్నిటికీ కారణం ఒక్కటే. పవన్ ని అభిమానులు సినీ హీరోగా ఇష్టపడినంతగా రాజకీయ నాయకుడి పాత్రలో ఊహించుకోలేకపోతున్నారు. కాస్త ఎక్కువ గ్యాప్ వచ్చినా సినిమాల్లోకి సాదర స్వాగతం పలికారు, సందడి చేశారు. కానీ పొలిటికల్ గా కాస్త గ్యాపిచ్చి ఎంట్రీ ఇస్తే మాత్రం ఆటాడేసుకున్నారు.

“సినిమా షూటింగ్ లేదా ఇలా వచ్చావ్”, “కాల్షీట్లు ఖాళీగా ఉన్నాయా మీటింగ్ పెట్టావ్”, “మేనల్లుడి సినిమా ఓపెనింగ్ కోసం సెలవు పెట్టిన పవన్ ఈ సాయంత్రాన్ని ఇలా వాడుకుంటున్నారన్నమాట”… అంటూ చాలా రకాల కామెంట్లే పడ్డాయి పవన్ పై. అందులోనూ ఎప్పుడూ సింగిల్ గా వచ్చే పవన్ కల్యాణ్ ఇప్పుడు గుంపులో ఒకరిగా మారిపోయారు. బీజేపీ నేతలతో కలసి పవన్ ని ప్రెస్ మీట్లో చూడలేకపోయామని, అసలు పవన్ వాయిస్ కూడా బలంగా లేదని కొంతమంది వీరాభిమానులు నొచ్చుకున్నారు.

మొత్తమ్మీద సినిమా హీరోగా పవన్ పై కురిపించిన అభిమానాన్ని, రాజకీయ నాయకుడిగా ఆయనపై చూపించలేకపోతున్నారు అభిమానులు. ఫ్యాన్స్ ఆశలకి అనుగుణంగా పవన్ మారతారో లేక, పరువుపోతున్నా పాతికేళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తారో వేచి చూడాలి.

నాకు స్వయంవరం అంత అవసరమా ?

బాబుకి దెబ్బ మీద దెబ్బ