పవన్ గాజువాక వస్తారట ?

గాజువాక, గాజుగ్లాస్.. ఈ రెండింటికీ రైమింగ్ సరిపోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ జనసేన తరఫున గాజువాకలో పోటీ చేశారు. ఆయన గుర్తు గాజుగ్లాస్. మూడు ప్రధాన పార్టీల మధ్య పోరులో…

గాజువాక, గాజుగ్లాస్.. ఈ రెండింటికీ రైమింగ్ సరిపోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ జనసేన తరఫున గాజువాకలో పోటీ చేశారు. ఆయన గుర్తు గాజుగ్లాస్. మూడు ప్రధాన పార్టీల మధ్య పోరులో గాజుగ్లాస్ పగిలింది. వైసీపీ అభ్యర్ధి రియల్ హీరో అంటూ జగన్ చేసిన ప్రచారంతో  తిప్పల నాగిరెడ్డిని గెలిపించారు. మొత్తానికి పవన్ ఓడిపోయారు. 

ఆ తరువాత గాజువాక అంటేనే పవన్ కి చిర్రెత్తుకువచ్చేదని అంటారు.  ఎన్నికల్లో గెలిచినా ఓడినా గాజువాకలోనే ఉంటానంటూ అప్పట్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని మరీ హంగామా చేసిన పవన్ ఓడాక గాజువాక రాకపోవడం పట్ల అభిమానులు తెగ ఫీల్ ఆయ్యారు.

ఏకంగా గాజువాక సమీక్షకు కూడా పవన్ అప్పట్లో డుమ్మా కొట్టారు. ఇక ఓడిన అయిదు నెలల తరువాత లాంగ్ మార్చ్ పేరిట విశాఖ వచ్చి హల్ చల్ చేశారు. ఇపుడు స్థానిక ఎన్నికల పుణ్యమాని పవన్ మరో సారి ఇటువైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

పవన్ తన టూర్లో గాజువాకను కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ పార్టీ నేతలు కోరితే మీటింగు కూడా ఉంటుందిట. మొత్తం మీద చూసుకుంటే పవన్ గాజువాకకు లోకల్ బాడీ ఎన్నికల రూపేణా అయినా వస్తే అదే పదివేలు అనుకుంటున్నారుట అభిమానులు.

నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?

మేన‌ల్లుడి చిత్ర ప్రారంభోత్స‌వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్