బాబు నువ్వు సెప్పు.. లోకేష్ ను కొట్టమని డప్పు

వైసీపీ నాయకులు ఐదేళ్ల తర్వాత చంద్రబాబుకి ఇప్పుడున్న స్థానాలు కూడా ఊడిపోతాయని, ఆయన ఒంటరిగా మిగులుతారని అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తల్లకిందులై.. కేవలం 9 నెలల్లోనే మాజీలు, తాజాలు.. సరంజామా సర్దుకుని…

వైసీపీ నాయకులు ఐదేళ్ల తర్వాత చంద్రబాబుకి ఇప్పుడున్న స్థానాలు కూడా ఊడిపోతాయని, ఆయన ఒంటరిగా మిగులుతారని అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తల్లకిందులై.. కేవలం 9 నెలల్లోనే మాజీలు, తాజాలు.. సరంజామా సర్దుకుని వలసపోతున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి బాటలో.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. వైసీపీ నీడలోకి వెళ్లబోతున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు పోతే మిగిలింది 20 అందులో కూడా అవకాశం రాక, అట్నుంచి గ్రీన్ సిగ్నల్ పడక.. గంటా లాంటి చాలా మంది వేచి చూస్తున్నారు. లేకపోతే ఈ పాటికే బాబు, బాలయ్య తప్ప ఎమ్మెల్యేలంతా ఆ గట్టున తేలేవారే. ఇక జిల్లాల్లో బలమైన నాయకత్వం స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీని వీడుతోంది. ఇది వైసీపీ కూడా ఊహించని పరిణామమే. డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎస్‌ఏ రెహమాన్, కదిరి బాబూరావు, కడప జిల్లాలో బలమైన నాయకులు రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే లోపు జిల్లాల్లో పెద్ద నాయకులంతా “ఫ్యాన్” కిందకి చేరిపోతారని స్పష్టమవుతోంది.

బాబుకి విపరీతంగా డప్పు కొట్టే రాజ్యసభ సభ్యులంతా ఇప్పటికే మూకుమ్మడిగా జంపయ్యారు. ఎమ్మెల్యేల విశ్వసనీయతపై ఎవరికీ నమ్మకం లేదు. ఇక మిగిలింది బాలకృష్ణ, రేపో మాపో మాజీ ఎమ్మెల్సీ కాబోతున్న లోకేష్ మాత్రమే. ఇక వీరిద్దరే బాబుకి అటు ఇటు చేరి డప్పు కొట్టాలి. లీడర్లు పోయి, క్యాడర్ పోయి.. ఇక చంద్రబాబు ఏం చేయాలి. అటు బామ్మర్ది, ఇటు కొడుకుతో డప్పు కొట్టించుకోవాలి.

విచిత్రం ఏంటంటే.. వీరిద్దరూ నోరు తెరిచారంటే దబిడి దిబిడే. బాలయ్య మాటలు ఎవరికీ అర్థం కావు, లోకేష్ మాట్లాడితే విపరీతార్థాలు వస్తాయి. అంటే వీళ్లు డప్పు కొట్టడానికి కూడా పనికిరారన్నమాట. ఇంత దారుణమైన స్థితికి చేరుకుంటానని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరేమో.

మేన‌ల్లుడి చిత్ర ప్రారంభోత్స‌వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్

నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?