ఏపీకి పాకిన కరోనా.. తొలి కేసు నమోదు

అనుమానం నిజమైంది. పుకారు వాస్తవరూపం దాల్చింది. నెల్లూరుకు చెందిన ఓ యువకుడికి కరోనా వచ్చినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. నిజానికి ఇతడికి కరోనా వచ్చిందనే పుకారు చాలా జోరుగా నడిచింది. దీంతో అంతా దాన్ని…

అనుమానం నిజమైంది. పుకారు వాస్తవరూపం దాల్చింది. నెల్లూరుకు చెందిన ఓ యువకుడికి కరోనా వచ్చినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. నిజానికి ఇతడికి కరోనా వచ్చిందనే పుకారు చాలా జోరుగా నడిచింది. దీంతో అంతా దాన్ని పుకారే అనుకున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. అంతలోనే తిరుపతి వైరాలజీ డిపార్ట్ మెంట్ లో పరీక్ష చేయడం, పాజిటివ్ గా రావడం చకచకా జరిగిపోయాయి.

రిపోర్ట్ పాజిటివ్ వచ్చే టైమ్ కే సదరు వ్యక్తి ఐసోలేషన్ వార్డులో ఉన్నాడు. అయితే రిపోర్ట్ వచ్చే టైమ్ కే అతడిలో కరోనా లక్షణాలు తగ్గి ఆరోగ్యంగా తయారయ్యాడు. అయినప్పటికీ మరికొన్ని రోజులు అతడ్ని ఐసోలేషన్ లోనే ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. మరోవైపు అతడితో కాంటాక్ట్ లోకి వచ్చిన మరో ఐదుగుర్ని కూడా ఐసోలేషన్ వార్డుకు షిఫ్ట్ చేశారు.

కరోనాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పటికే అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వ్యక్తులను నిశితంగా గమనిస్తోంది. ఈ మేరకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు కూడా అప్పగించింది. మరోవైపు ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటుచేసింది. తొలి కరోనా కేసు బయటపడ్డంతో ఇకపై మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని నిర్ణయించింది.

తాజా కేసుతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 73కి చేరింది. ఇప్పటికే దేశంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం.. వివిధ దేశాల నుంచి ఇండియాలోకి ప్రవేశించే వ్యక్తులపై నిషేధం విధించింది. ఏప్రిల్ 15 వరకు అన్ని దేశాల వీసాలను రద్దుచేసింది. భారత్ తో మయన్మార్ బోర్డర్ ను మూసేసింది. బ్రిటన్ మినహా అన్ని దేశాల నుంచి రాకపోకల్ని నిలిపివేసి స్వీయనిర్భంధాన్ని విధించుకుంది.

నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?

మేన‌ల్లుడి చిత్ర ప్రారంభోత్స‌వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్