సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్-దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఓ హిట్ కాంబినేషన్. చిరకాలంగా సాగుతోంది వీరిద్దరి ప్రయాణం. మధ్యలో బోయపాటి ఓసారి 'పిండేసాను' అని ఓపెన్ గా అన్నమాట వల్ల కాస్త గ్యాప్ వచ్చినట్లు అనిపించినా, బోయపాటి తానే సర్దుకుని, అలాంటిది ఏమీలేదని క్లారిటీ ఇచ్చారు. ఆపైన ఆ ప్రయాణం జయజానకీనాయక మీదుగా వినయ విధేయరామ వరకు కొనసాగింది.
అయితే ఇకపై ఈ జర్నీ వుంటుందా? వుండదా? అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగిందని, దాని ఫలితం వినయ విధేయ రామ అడియో మీద కూడా పడిందని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయ. అంతేకాదు, వినయ విధేయరామ సినిమాలో హీరో ఎక్కువసేపు కనిపించని రెండు కీలక ఎపిసోడ్ లు వున్నాయట.
ఈ రెండుకీలక ఎపిసోడ్ లను ఆర్ ఆర్ తో రక్తికట్టించాల్సి వుందట. మరి వీటికి దేవీ ఏం చేస్తాడో? అన్న డిస్కషన్లు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది. దేవీ ఈ మధ్య పాటల మీద శ్రద్ధ తగ్గించారని, అమెరికాలో షోలు అలాంటి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టారని, అందువల్ల అతని దగ్గర నుంచి సరైన అడియో రావడంలేదని కూడా టాక్ వుంది.
ఇలాంటి నేపథ్యంలో దేవీ-బోయపాటి కాంబినేషన్ రాబోయే బాలయ్య సినిమాకు వుంటుందా? అన్న డౌట్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో? కానీ సమస్య ఏమిటంటే, దేవీని రీప్లేస్ చేద్దామన్నా, తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా సాధ్యంకావడం లేదు.