‘వినయ’లో ఆ అరగంటా స్పెషల్

రామ్ చరణ్-బోయపాటి కాంబో వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఆ సినిమా స్టిల్స్ దర్ళనమిస్తున్నాయి. ముఖ్యంగా హీరో రామ్ చరణ్, కండలు తిరిగిన శరీరంతో, వంటి నిండా…

రామ్ చరణ్-బోయపాటి కాంబో వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఆ సినిమా స్టిల్స్ దర్ళనమిస్తున్నాయి. ముఖ్యంగా హీరో రామ్ చరణ్, కండలు తిరిగిన శరీరంతో, వంటి నిండా టట్టూలతో బీభత్సంగా కనిపిస్తున్నాడు. కుర్రకారు నచ్చే డబ్ల్యు, డబ్ల్యు డబ్ల్యు రెజ్లర్ మాదిరగా దర్శనమిస్తున్నాడు.

అయితే ఈ వైనం అంతా సినిమాలోని కీలకమైన ఓ ఎపిసోడ్ లో వుంటుందని తెలుస్తోంది. సినిమాలో విశ్రాంతి తరువాత అరగంట సేపు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వుంటుంది. ఆ అరగంట బీహార్ బ్యాక్ డ్రాప్ అన్నమాట. అయితే దీన్ని అజర్ బైజాన్ లో చిత్రీకరించారు. ఈ అరగంట సినిమాలో బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ లు వుంటాయని, ఈ సీన్లలోనే రామ్ చరణ్ ఈ గెటప్ ల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.

సాధారణంగా బోయపాటి సినిమాలకు రామ్ లక్ష్మణ్ ఫైట్ల మాస్టర్లుగా అద్భుతమైన ఫైట్లు కంపోజ్ చేసారు ఇప్పటివరకు. ఇప్పుడు వినయ విధేయకు మాత్రం కనల్ కన్నన్ పనిచేసారు. బోయపాటి-కనల్ కన్నన్ కాంబినేషన్ ఎలా వుంటుందో చూడాలి మరి.

జగన్ కి అవగాహన లేకే అలా మాట్లాడాడు.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు 

వివాదాలు.. వైఫల్యాలు.. వివాహాలు..!