కొట్టుకున్న ఎమ్మెల్యేలు

బిహార్ అసెంబ్లీలో అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మంత్రి రామ్‌సూర‌త్ రాయ్ సోద‌రుడికి సంబంధించిన పాఠ‌శాల‌లో ఇటీవ‌ల భారీగా మ‌ద్యం ప‌ట్టుబ‌డ‌డంపై అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్ ధ్వ‌జ‌మెత్తారు. ఇది కాస్త అధికార‌,…

బిహార్ అసెంబ్లీలో అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మంత్రి రామ్‌సూర‌త్ రాయ్ సోద‌రుడికి సంబంధించిన పాఠ‌శాల‌లో ఇటీవ‌ల భారీగా మ‌ద్యం ప‌ట్టుబ‌డ‌డంపై అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్ ధ్వ‌జ‌మెత్తారు. ఇది కాస్త అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య కొట్టుకునే వ‌ర‌కూ దారి తీసింది.

మంత్రి సోద‌రుడి పాఠ‌శాల‌లో మ‌ద్యం ప‌ట్టుబ‌డిన నేప‌థ్యంలో నైతిక బాధ్య‌త వ‌హించి మంత్రి రామ్‌సూర‌త్ రాయ్‌ త‌క్ష‌ణ‌మే త‌న ప‌దవికి రాజీనామా చేయాల‌ని  తేజ‌స్వి యాద‌వ్ డిమాండ్ చేశారు. 

ఈ డిమాండ్ తీవ్ర దుమారం రేపింది. చివ‌రికి బాహాబాహీకి ఎమ్మెల్యేలు దిగారు. అసెంబ్లీలో గొడ‌వ అనంత‌రం బ‌య‌ట మీడియాతో మాట్లాడిన మంత్రి రామ్‌సూర‌త్‌.. తేజ‌స్వి డిమాండ్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

త‌న సోద‌రుడి పాఠ‌శాల‌లో మ‌ద్యం దొరికితే తానెలా బాధ్యుడిన‌వుతాన‌ని ప్ర‌శ్నించారు.  తానెందుకు రాజీనామా చేయాల‌ని ఆయ‌న నిల‌దీశారు.  ద‌ర్యాప్తులో త‌న సోద‌రుడు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే జైలుకు పంప‌వ‌చ్చ‌న్నారు. 

నా సినిమాలు ఎక్కువగా ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

పొలిట‌ర‌ల్ రీఎంట్రీపై జూ.ఎన్టీఆర్ రియాక్ష‌న్