ఒకానొక హీరోయిన్ తో రొమాంటిక్ సీన్లో పదే పదే జీవించేందుకు ఒక హీరో కెమెరామెన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడని, వీలైనన్ని ఎక్కువ టేకుల కోసం హీరో ఆ ఎత్తుగడ వేశాడనే రూమర్లు అడపాదడపా వినిపిస్తూ ఉంటాయి. తమకు తలొగ్గని హీరోయిన్లను ఆబగా తడుముకోవడానికి రొమాంటిక్ సీన్లను హీరోలు ఇలా వాడుకుంటారనే రూమర్లు ఈనాటివి కావు! దశాబ్దాల నుంచి ఉన్నవే!
మరి అలాంటి రూమర్లను రూమర్లుగా కొట్టి పడేయలేని విధంగా కొన్ని సార్లు అధికారికంగా కూడా చర్చలో ఉంటాయి! ఇలాంటివే కొన్ని 'మీ టూ' అంటూ ఇటీవల కాలంలో వార్తల్లో కూడా నిలిచాయి. అలాంటి వివాదం కాదు కానీ, బాలీవుడ్ క్లాసిక్ 'షోలే' విషయంలో చర్చలో ఉన్న స్పైసీ గాసిప్ ఇది. దశాబ్దాల నాటిదే. ఆ సినిమా షూటింగ్ లో హీరో ధర్మేంద్ర హీరోయిన్ హేమమాలిని తో వేసిన రొమాంటిక్ వేషం ఇది!
ఆ తర్వాతి కాలంలో తన భార్య అయిన హేమమాలినిని అప్పటికే పీకల్దాకా ప్రేమిస్తున్నారట ధర్మేంద్ర. అప్పటికే ఆయన వివాహితుడు. అలాగని ప్రేమలో పడకూడదని లేదు కదా. హేమను విపరీతంగా ప్రేమించేస్తున్న ధర్మేంద్ర షూటింగులో భాగంగా కౌగిలింత సీన్ చిత్రీకరణలో తన ప్లేబాయ్ రూపాన్ని ప్రదర్శించారట.
ఆ సీన్ చిత్రీకరణ సందర్భంగా ప్రతిసారీ ఏదో ఒక తప్పు చేసేలా స్పాట్ బాయ్ ను పురమాయించాడట ధర్మేంద్ర. నటన పరంగా, టేకింగ్ పరంగా ఓకే అయినా.. స్పాట్ బాయ్ తప్పిదంతో పదే పదే ఆ సీన్ ను మళ్లీ మళ్లీ చిత్రీకరించేట్టుగా ధర్మేంద్ర ఎత్తుగడ వేసి, దాన్ని అమల్లో పెట్టాడట. హేమమాలిని కౌగిలించుకునే ఆ సీన్లో తనకు సహకారం అందించినందుకు సదరు స్పాట్ బాయ్ కు రెండు వేల రూపాయల లంచాన్ని ఇచ్చారట ధర్మేంద్ర!
అలా ఆమె కౌగిలి కోసం అంత ఎత్తుగడలు వేసిన ధరమ్ జీ.. అలానే తన ప్రేమ గురించి ఆమెకు తెలియపరిచినట్టుగా ఉన్నారు. వివాహం కోసం మతం మారే ఎత్తుగడ కూడా ధరమ్ జీదే! హేమమాలిని ధర్మేంద్రకు భార్య అయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది.
అయితే ధర్మేంద్ర మొదటి భార్య సంతానం మాత్రం వీరిని యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపించదు. రెండు కుటుంబాల మధ్యన దూరాన్ని మెయింటెయిన్ చేయడంలో కూడా ధర్మేంద్ర చాలా కఠినంగా కనిపిస్తుంటారు కూడా!