సీనియర్ హీరో చికాకు పడ్డారు

ఆయన ఓ సీనియర్ హీరో. ఆయనతో సినిమా చేయాలంటే అంత వీజీకాదు. స్క్రిప్ట్ చెక్కడానికి, ఆయన చేత, ఆయన వ్యవహారాలు చూసే ఆయన కుటుంబ పెద్ద చేత ఓకె చేయించుకోవడానికే నెలలు పడుతుంది. సినిమా…

ఆయన ఓ సీనియర్ హీరో. ఆయనతో సినిమా చేయాలంటే అంత వీజీకాదు. స్క్రిప్ట్ చెక్కడానికి, ఆయన చేత, ఆయన వ్యవహారాలు చూసే ఆయన కుటుంబ పెద్ద చేత ఓకె చేయించుకోవడానికే నెలలు పడుతుంది. సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చిందని, చటుక్కున సినిమా ఓకె చేసాడు. కానీ ఓకె చేసాక తెలిసిందట బౌండ్ స్క్రిప్ట్ రెడీగా లేదని. 

ఇలాంటి నేపథ్యంలో సదరు సీనియర్ హీరోకు తరచు సెట్ లో సమస్యల ఎదురయినట్లు తెలుస్తోంది. షూటింగ్ కు వస్తే, తనను కారవాన్లో కూర్చోపెట్టి, సీన్లు రెడీ చేయడం, రాస్తుండడం గమనించి ఆఖరికి డైరక్టర్ ను గట్టిగా నిలదీసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

'ఇప్పటిదాకా తన కెరీర్ లో ఇలాంటి ప్లానింగ్ లేని, స్క్రిప్ట్ రెడీగా లేని సినిమా చేయలేదని' ఆ హీరో బాహాటంగానే డైరక్టర్ పై చికాకు పడినట్లు తెలుస్తోంది. దీంతో షూట్ ను వారంరోజులు పక్కనపెట్టి, ఆ సీనియర్ హీరోకు విశ్రాంతి ఇచ్చి, ఆయన పోర్షన్ అంతా తయారుచేసి, అప్పుడు సెట్ మీదకు రప్పించినట్లు తెలుస్తోంది.

హిట్ డైరక్టర్ కావడం, ఫస్ట్ హాఫ్ సూపర్ గా చెప్పడంతో, నిర్మాత కూడా చటుక్కున సెట్ మీదకు వెళ్లిపోయారని, దాంతో సెకండాఫ్ అంతా మార్చి, మార్చి వండారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ హీరో చివాట్లు పెట్టారన్నది వినిపిస్తున్న గ్యాసిప్ ల సారాశం.

న్యూ ఇయర్ స్పెషల్ చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

మోడీ ఎదుగుదలను RSS కట్ చేస్తోందా?