దటీజ్ అనసూయ

యాంకర్ అనసూయ ఓ డిఫరెంట్ పర్సనాలిటీ. జబర్దస్త్ లో కనిపించే గ్లామర్ డాల్ అనసూయ వేరు. సినిమాల్లో తనదైన మంచి పాత్రలు వేస్తూ పేరు తెచ్చుకుంటున్న అనసూయ వేరు. అంతే కాదు, సినిమా రంగంలోని…

యాంకర్ అనసూయ ఓ డిఫరెంట్ పర్సనాలిటీ. జబర్దస్త్ లో కనిపించే గ్లామర్ డాల్ అనసూయ వేరు. సినిమాల్లో తనదైన మంచి పాత్రలు వేస్తూ పేరు తెచ్చుకుంటున్న అనసూయ వేరు. అంతే కాదు, సినిమా రంగంలోని జనాలతో ఎవరితో ఎలా వుండాలో అన్నది క్లారిటీగా తెలిసిన అనసూయ అంతకన్నా వేరు. ఐటమ్ సాంగ్ లు చేయాలని అనుకంటే ఈపాటికి చాలా సినిమాల్లో అనసూయ ఐటమ్ సాంగ్స్ వుండేవి.  కానీ అనసూయకు అది ఇష్టం లేదు. 

కానీ బన్నీవాస్ పట్టుపట్టారు. అనసూయ ఫ్రెండ్ జానీ మాస్టర్ కాస్త మొహమాట పెట్టారు. అంతే, చావు కబురు చల్లగా సినిమాలో ఓ డిఫరెంట్ సాహిత్యంతో కూడిన ఐటమ్ సాంగ్ ను అనసూయ చేసేసారు. ఇప్పుడు చాలా మంది ఆలోచన వేరు. అసలు అనసూయ ఈ పాటకు ఎంత తీసుకుని వుంటుంది? మంచి పేమెంట్ ఆఫర్ చేసి వుంటారు. అందుకే ఐటమ్ సాంగ్ కు ఓకె అనివుంటుంది అన్న భావన.

కానీ వాస్తవం ఏమిటంటే ఇప్పటి వరకు ఆమె అడగలేదు. వీళ్లు ఇవ్వలేదు. బన్నీవాస్ మాట మీద పాట చేసేసింది అనసూయ. వాళ్లే ఎగ్గొట్టేవాళ్లు కాదు, తక్కువ ఇచ్చేవారు కాదు..అదే ధీమా. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ పాటకు అనసూయకు అందబోయే రెమ్యూనిరేషన్ 15 లక్షల వరకు వుంటుందని తెలుస్తోంది.

గమత్తేమిటంటే అదే గీతా బ్యానర్, అరవింద్ మీద గౌరవంతో రెమ్యూనిరేషన్ గురించి మాట్లాడకుండా చావు కబురు చల్లగా సినిమా చేసేసాడు హీరో కార్తికేయ కూడా. పైగా చేస్తున్న సినిమా ఒకటి పక్కన పెట్టి మరీ ఈ సినిమా పినిష్ చేసాడు. ఇప్పుడు సినిమా పూర్తయిపోయింది. విడుదలకు రెడీ అయిపోయింది. అయినా రెమ్యూనిరేషన్ గురించి మాట్లాడ లేదు. కేవలం గీతా సంస్థనే చూసుకుంటుందనే నమ్మకం.

నా సినిమాలు ఎక్కువగా ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

పొలిట‌ర‌ల్ రీఎంట్రీపై జూ.ఎన్టీఆర్ రియాక్ష‌న్