విరాటపర్వం..పెర్ ఫెక్ట్ నిడివి

సినిమాకు నిడివి కూడా కీలకం. కేజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లు అయితే మూడు గంటలు అనా చల్తా, అలా కాకుండా రెగ్యులర్ సినిమాలు అయితే క్రిస్ప్ నెరేషన్ వుండకపోతే జనం కాస్త ఇబ్బందిపడతారు.  Advertisement…

సినిమాకు నిడివి కూడా కీలకం. కేజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లు అయితే మూడు గంటలు అనా చల్తా, అలా కాకుండా రెగ్యులర్ సినిమాలు అయితే క్రిస్ప్ నెరేషన్ వుండకపోతే జనం కాస్త ఇబ్బందిపడతారు. 

అంటే సుందరానికి బాగానే వుంది కానీ మూడు గంటల సినిమా అనే పాయింట్ మీదే జనం పక్కన పెట్టారు. కనీసం 20 నుంచి 30 నిమషాలు తగ్గించమన్నా దర్శకుడు వినలేదు.

సరే ఆ సంగతి అలా వుంచితే ఈవారం విడుదల కాబోతున్న విరాటపర్వం సినిమా నిడివి జస్ట్ రెండు గంటల 31 నిమషాలు మాత్రమే. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తీసిన ప్రేమకావ్యం లాంటి సినిమా ఇది. భావోద్వేగాలు నిండిన ప్రేమ కథను షార్ప్ గా చెప్పడం అంటే అంత సులువు కాదు. ఈ విషయంలో దర్శకుడు వేణు ఉడుగుల సక్సెస్ అయినట్లే.

నిజానికి ఓ అమ్మాయి అమాయకత్వం, ఓ రచయిత పట్ల అభిమానం, ఆ అభిమానం ప్రేమగా మారడం,ఈ నేపథ్యం ఇలా వుండగా నక్సలిజం, సిద్దాంతాల స్పర్శ ఇవన్నీ కలిసిన కథను సుతిమెత్తగా రెండున్నర గంటల్లో చెప్పే ప్రయత్నం అంటే మెచ్చుకోదగ్గదే. ఈ పనిలో దర్శకుడు ముందుగా సాధించిన విజయం ఏమిటంటే తక్కువ లెంగ్త్ అన్నదే.

రానా, సాయిపల్లవి కీలకపాత్రలు ధరించిన ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ చెరుకూరి.