టీడీపీ అధినేత చంద్రబాబు చీటికి మాటికీ విశాఖకే వస్తూంటారు. ఆయన బాదుడే బాదుడుకు కూడా విశాఖ సహా ఉత్తరాంధ్రానే ఎంచుకున్నారు. ఇపుడు ఎన్టీయార్ స్పూర్తి చంద్రన్న భరోసా పేరిట జిల్లాల టూరు అని మరో కార్యక్రమం ఆయన చేపడుతున్నారు.
పేరు ఏదైనా జనాల వద్దకు వెళ్ళి అధికార పార్టీని తిట్టి టీడీపీ గొప్పను తన గొప్పను చెప్పుకోవడమే ఉద్దేశ్యం. అందులో భాగంగా విశాఖ చేరుకున్న బాబు మూడు రోజుల పాటు విశాఖ, విజయనగరం జిల్లాలలో కలియతిరుగుతారు.
టీడీపీకి ఈ జిల్లాలలో మాత్రం బాగా కమిటెడ్ క్యాడర్ ఉంది. వారు అధినేత ఎపుడు వచ్చినా జెండాలు కడతారు ఆయన వెంట పరుగురులు పెడతారు. దాంతో విశాఖ వస్తే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అని బాబు చాలా సార్లు చెబుతూ ఉంటారు. విశాఖ వస్తే ఏపీలో మళ్ళీ టీడీపీ గెలిచేసినంత ఫీలింగ్ కూడా అధినాయకుడికి వస్తుందిట.
దాంతో చంద్రబాబు విశాఖ టూర్ సరైన టైమ్ లో పెట్టుకున్నారు. అలాగే పార్టీకి బూస్టింగ్ కోసం ఆయన ఉత్తరాంధ్రానే నమ్ముకున్నారు అని అంటున్నారు. మరి ఈ ట్రిప్ లో బాబు జనాలను చూసి విజయదరహాసం చేస్తే అదే టీడీపీకి శ్రీరామ రక్ష అని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అందుకోసం శక్తిమేరకు జనసమీకరణ అయితే చేశారు. మరి బాబుకు బారీ కిక్కిచ్చే టూర్ విశాఖ అవుతుందా అంటే ఆయనే మీడియాతో చెప్పాలి ఆ మాట.