Advertisement

Advertisement


Home > Politics - Analysis

జగన్ టార్గెట్ బాలయ్య.. ఈ ముచ్చట తీర్చేది ఎవరు?

జగన్ టార్గెట్ బాలయ్య.. ఈ ముచ్చట తీర్చేది ఎవరు?

కుప్పంలోనే కాదు, హిందూపురంలో కూడా టీడీపీని ఓడించాలనేది జగన్ పట్టుదల. నారా, నందమూరి కుటుంబాలను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదనే ఆలోచనతో ఉన్నారు. అయితే హిందూపురంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు బాలయ్యకు కలసి వచ్చేలా ఉన్నాయి. అందుకే తానే స్వయంగా కలుగజేసుకుని, ఆ గొడవలను తీర్చి, పార్టీని పటిష్టపరచే బాధ్యత పెద్దిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్.

హిందూపురం అనేది టీడీపీకి సెంటిమెంట్ స్థానం. గతంలో ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన ఆ స్థానంలో ఇప్పుడు బాలయ్య తిష్టవేశారు. 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ టీడీపీదే విజయం. అలాంటి టీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టాలనుకుంటోంది. అదేమంత పెద్ద విషయం కాదు. అక్కడ టీడీపీ మెజార్టీ 20వేలకు తక్కువగానే ఉంటోంది. కాస్త కష్టపడితే హిందూపురంలో వైసీపీ జెండా ఎగరొచ్చు.

కానీ అక్కడ వైసీపీకి ఒక స్థిరమైన అభ్యర్థి లేరు. 2014లో నవీన్ నిశ్చల్ వైసీపీ తరపున పోటీ చేశారు, 2019లో మొహ్మద్ ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో వైసీపీకి ఇన్ చార్జిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి ఇక్బాల్ కి వ్యతిరేక వర్గంగా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య సయోధ్య లేకపోవడంతో హిందూపురంలో వైసీపీ కాస్త వీక్ గా ఉంది.

తాజాగా సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ను వేణుగోపాల్ రెడ్డి, ఇక్బాల్ ఇద్దరూ వచ్చి కలిశారు. అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోడానికే సమయం సరిపోయింది. పార్టీని పటిష్టపరచాలంటూ వారిద్దరికీ సూచించారు సీఎం జగన్. అయితే ఎంతసేపటికీ వారు ఫిర్యాదులపైనే దృష్టిపెట్టడంతో.. అక్కడితో వ్యవహారాన్ని కట్ చేశారు. పెద్దిరెడ్డిని పిలిచి పంచాయితీ నిర్వహించాలని సూచించారు.

పెద్దిరెడ్డి చేతిలోనే హిందూపురం భవిష్యత్తు..

ఇటీవల గన్నవరం వ్యవహారం కూడా ఇలాగే హాట్ హాట్ గా సాగింది. వల్లభనేని వంశీకి అధిష్టానం అభయహస్తం ఇచ్చినా కూడా యార్లగడ్డ వెంకట్రావు అక్కడ అడపాదడపా రచ్చ చేస్తున్నారు. 

ఇక్కడ హిందూపురంలో సమస్య అది కాదు, టీడీపీ నుంచి ఆ సీటుని వైసీపీ లాక్కోవాలి. అంటే అక్కడ మరింత బలంగా ఉండాలి. ఇప్పుడే వర్గాలుంటే ఇక ఎన్నికలనాటికి ఆ విభేదాలు బలపడే అవకాశముంది. జగన్ ఆశించినదాన్ని నాయకులు నెరవేరుస్తారో లేదో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?