థియేటర్లు అమ్మేసిన దర్శకుడు

విశాఖపట్నం వి మాక్స్ అనగానే సినిమా జనాలకు గుర్తుకు వచ్చేంది దర్శకుడు వివి వినాయక్. దానికి కారణం ఆ థియేటర్ల యజమాని ఆయనే. కానీ ఇప్పడు వాటిని ఆయన విక్రయించేసారు. ఓ హైపర్ మార్కెట్…

విశాఖపట్నం వి మాక్స్ అనగానే సినిమా జనాలకు గుర్తుకు వచ్చేంది దర్శకుడు వివి వినాయక్. దానికి కారణం ఆ థియేటర్ల యజమాని ఆయనే. కానీ ఇప్పడు వాటిని ఆయన విక్రయించేసారు. ఓ హైపర్ మార్కెట్ చెయిన్ ఆ థియేటర్ కాంప్లెక్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

ఆ సంస్థ థియేటర్లను పడగొట్టి, అక్కడ అతి పెద్ద హైపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. మంచి రేటు రావడంతో వినాయక్ థియేటర్లను విక్రయించేసినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు కమల్..రాజ్ కమల్ అనే జంట థియేటర్లు వుండేవి. తరువాత వాటిలో ఒకటి మెలోడీ థియేటర్ గా మారింది. రెండో థియేటర్ ను వినాయక్ కొనుగోలు చేసి, వి మాక్స్ పేరిట థియేటర్ల సముదాయంగా మార్చారు. 

వినాయక్ చేతిలోకి వచ్చాక ఆ థియేటర్లకు మంచి పేరు వచ్చింది. వినాయక్ సోదరుడు విజయ్ వాటి వ్యవహారాలు చూసుకునేవారు. ఇప్పుడు వినాయక్ మాంచి లాభసాటి బేరం రావడంతో వదిలేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు నిర్వహించిన తరువాత కొనుగోలు దారు వాటిని పడగొట్టేసి, తనకు అనుకూలంగా నిర్మాణాలు చేపడతారని వినిపిస్తోంది.