సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమా మరో షెడ్యూలు షూట్ తో రెడీ అయిపోతుంది. మార్చి ఎండ్ నుంచి ఏప్రిల్ లోపు విడుదలకు ఏర్పాట్లుచేస్తున్నారు. కానీ టైటిల్ జంఝాటమే ఇంకా తీరలేదు. దళపతి అన్న టైటిల్ పెట్టాలనుకున్నారు. ఓ చిన్న సినిమాకు ఆ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. దానికోసం ప్రయత్నించారు కానీ, ఫలితం రాలేదు. ఆ నిర్మాత ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
పోనీ చాలా సినిమాలకు చేసినట్లు శర్వానంద్ దళపతి లేదా శర్వా దళపతి అని టైటిల్ సెట్ చేసుకోవచ్చు. కానీ అనవసరపు వివాదాలు ఎందుకు అన్న పాయింట్ తో ఆగిపోయినట్లు తెలుస్తోంది. నాయకుడు అనే టైటిల్ కూడా సూట్ అవుతుంది కానీ, సినిమా మీద అక్కరలేని అంచనాలు పెంచినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా టైటిల్ ఫ్రకటన చేసే ప్రయత్నం అయితే సాగుతోందని, సరైన టైటిల్ కోసం డైరక్టర్ సుధీర్ వర్మ ఆలోచిస్తున్నారు. దొరికితే న్యూ ఇయర్ కు ప్రకటించే అవకాశం వుంది. ఈ సినిమాలో హీరో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు.
యంగ్ గెటప్ లో, వయసు మళ్లిన డాన్ లుక్ లో కూడా. ఈ సినిమాకోసం విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాల్లో, హైదరాబాద్ లో పలు సెట్ లు వేసి షూట్ చేసారు.