మెగాభిమానుల వాట్సాప్ ఆవేదన

హీరోలను హీమాన్ లు చేసేది, వారిని భుజాలపై మోసేది అభిమానులే. హీరోలు అడియో పంక్షన్ ల స్టేజ్ ల మీద, మా ఫ్యామిలీ, దేవుడు మాకు పెద్ద ఫ్యామిలీ ఇచ్చాడు. మీరంతా మా ఫ్యామిలీ…

హీరోలను హీమాన్ లు చేసేది, వారిని భుజాలపై మోసేది అభిమానులే. హీరోలు అడియో పంక్షన్ ల స్టేజ్ ల మీద, మా ఫ్యామిలీ, దేవుడు మాకు పెద్ద ఫ్యామిలీ ఇచ్చాడు. మీరంతా మా ఫ్యామిలీ అనే పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. ఆన్ లైన్ లో ఇంట్లో వుండి హాయిగా చూడగలిగే కాలంలో కూడా, పాపం, అభిమానులు బోలెడు ఖర్చుచేసి అడియో ఫంక్షన్ లకు వస్తారు.

అడియో ఫంక్షన్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిచ్చగాళ్లలా వాళ్లనీ వీళ్లనీ పాస్ ల కోసం తెగ బతిమాలతారు. ఆఖరికి ఎక్కడో దూరంగా వుండి ఫంక్షన్ చూసి, దాన్ని సక్సెస్ చేస్తారు. పెద్ద హీరోల అడియో ఫంక్షన్ రోజు పాస్ ల కోసం గోల ఇంతా అంతా కాదు.

ఒకదశలో అభిమానులు చాలా అసహనానికి కూడా గురవుతారు. ఈరోజు మెగా హీరో రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ అడియో ఫంక్షన్ వుంది. దానికోసం ఎక్కడెక్కడి నుంచో అభిమానులు వచ్చారు. పాస్ లు అందక, వాట్సాప్ గ్రూప్ లో తమ ఆవేదన సర్క్యులేట్ చేస్తున్నారు.

మెగాభిమానుల గ్రూప్ ల్లో తిరుగుతున్న ఆ వాట్సాప్ మెసేజ్ ఇలా వుంది…

ఆడియో ఫంక్షన్ ఎవరికి లాభం
ఆడియో ఫంక్షన్ ముఖ్యంగా నిర్మాతకు ఉపయోగపడుతుంది. ఆ తరువాత ఈవెంట్స్ చేస్తున్నవారికి లాభసాటిగా ఉంటుంది. ఈ ఫంక్షన్ లో  Performance చేస్తున్నవారికి Logistics అన్ని విభాలవారికి డబ్బులు వస్తాయి. ఈ ఆడియో ఫంక్షన్ లో MVIPలో కూర్చుని  ఆనందపడేవారు అంత నిర్మాతకు, ఈవెంట్స్ వారికి సంభందించినవారే…

నష్టంఎవరికి జేబు చిల్లుపడేది ఎవరికి
తన అభిమాన నటుడిని ఆరాధించి ఆడియో ఫంక్షన్ లు విజయవంతం చేసి, సినిమా రిలీజుకు ఫంక్షన్లు చేసి, Housefull Collections చేయించి, సేవా కార్యక్రమాలు చేయడం అనేక విధాలుగా నష్టపోయేది అభిమానులు మాత్రమే..

ఉదాహరణకు ఆడియో ఫంక్షన్ చూడండి. ఒక అభిమాని ఆడియో ఫంక్షన్ కు వచ్చివెళ్ళాలంటే సగటున 5 వేలు ఖర్చు అవుతుంది. ఈరోజు జరుగుతున్న ఆడియో ఫంక్షన్ కు సుమారు 6 వేల మంది హైదరాబాద్ చేరుకున్నారు. అనగా సుమారు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఈ ఫంక్షన్ విజయవంతం కావడానికి అభిమానులే కారణం.

కానీ నిర్మాతగానీ, ఈవెంట్ ఆర్గనైజర్స్ గానీ అభిమానులను చాలా హీనంగా చూస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా మరియు కేరళ రాష్ట్రాల నుండి బ్లడ్ బ్యాంక్ నుండి మెగా పిలుపునందుకుని వేలాదిగా హైదరాబాదుకు తరలివచ్చారు.

కేవలం ఆంధ్రా, తెలంగాణా చూసుకుంటే 31 జిల్లాల నుండి వచ్చిన మెగా నాయకులకు గౌరవప్రదంగా MVIP పాసులు ఒక్కొక్క జిల్లాకు 5 MVIP పాసులు చొప్పున ఇవ్వాలంటే 155 పాసులు కనీసం అవసరముంటుంది.

కానీ నిర్మాత ఆఫీసు నుండి రాత్రి వచ్చిన MVIP పాసులు సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోవాలిసిందే..  ఎందుకు అభిమానుల మీద ఈ విధంగా చిన్న చూపు ఒకసారి నిర్మాతలు ఆలోచించాలి. ఒక్కొక్క అభిమాని చేసే పబ్లిసిటీ గానీ నిర్మాత చేయవలసిన పరిస్థితి వస్తే ఒక్కొక్క చిత్రానికి కనీసం నిర్మాతకు కోట్లకు కోట్లు ఖర్చు అవుతుంది.

ఇకపై అభిమానులు కూడా బాగా ఆలోచించుకుని ఫంక్షన్లకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

– రాష్ట్ర చిరంజీవి యువత

జగన్ కు ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ 

తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యం