నిర్మాతగా ఇటీవల పెద్దగా సక్సెస్ లో సాధించలేకపోయారు సాయి కొర్రపాటి. మంచి సినిమా అనిపించుకున్నా మనమంతా సినిమా నష్టాలే మిగిల్చింది. మెగా అల్లుడు కదా అని విజేత సినిమా చేస్తే అది కూడా అలాగే దగా చేసింది. నిర్మాణ భాగస్వామిగా, మెజారిటీ ఏరియాల బయ్యర్ గా ఎన్టీఆర్ బయోపిక్ మీద దృష్టిపెట్టి వుండిపోయారు.
ఇలాంటి టైమ్ లో అనుకోకుండా కేజిఎఫ్ సినిమా చేతిలోకి వచ్చింది. గత సినిమాల ఫలితాలు ఇచ్చిన వైరాగ్యంతో, ఒకరకం నిర్వేదంతో, కేజీఎఫ్ కు మరీ ఎక్కువ పబ్లిసిటీ చేయకుండానే వదిలేసారు. జస్ట్ నాలుగున్నర కోట్ల రిటర్న్ గ్యారంటీనో, లేదా అడ్వాన్స్ నో ఇచ్చి, సినిమాను తీసుకుని విడుదల చేసారు.
పైగా సినిమాను అమ్మకుండా ఎప్పటిలాగే తాను, అన్నపూర్ణ సాయిబాబు, ఎన్వీ ప్రసాద్ లాంటి తన ఫ్రెండ్స్ సాయంతో నేరుగా విడుదల చేసారు. నేరుగా విడుదలయిన సినిమాల కన్నా, పాజిటివ్ ట్రెండ్ కేజీఎఫ్ కే వచ్చింది. పడి పడి లేచె మనసు, అంతరిక్షం రేంజ్ షేర్ రాకపోయినా, ప్రస్తుతం ఫుల్స్, మంచి కలెక్షన్లు మాత్రం కేజీఎఫ్ నే కళ్ల చూస్తోంది.
ఇప్పటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల వరకు షేర్ వచ్చింది. ఈవారం కూడా పెద్దగా పోటీవచ్చే సినిమాలు లేవు. పైగా ఫస్ట్ వీక్ తరువాత చాలా థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. అందువల్ల కేజీఎఫ్ కు థియేటర్ల యాడ్ అయ్యే అవకాశం వుంది.
అందువల్ల డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలు కళ్ల చూసే అవకాశం వుంది. నిర్మాతగా సాయి కొర్రపాటి చేతులు కాల్చుకున్నారేమో కానీ, డిస్ట్రిబ్యూటర్ గా ఎప్పడూ బానే విజయాలు సాధిస్తున్నారు.