ఒకే వేదికపై టీఆర్ఎస్-కాంగ్రెస్

వినయ విధేయ రామ సినిమా అడియో వేడుక మాంచి కాంబినేషన్ కు వేదిక అవుతోంది. అధికారికంగా ఇంకా కాంగ్రెస్ లోనే వున్న మెగాస్టార్ చిరంజీవి, టీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ ఈ ఫంక్షన్ కు హాజరవుతున్నారు.…

వినయ విధేయ రామ సినిమా అడియో వేడుక మాంచి కాంబినేషన్ కు వేదిక అవుతోంది. అధికారికంగా ఇంకా కాంగ్రెస్ లోనే వున్న మెగాస్టార్ చిరంజీవి, టీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ ఈ ఫంక్షన్ కు హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు ఎప్పడో కామా పెట్టారు. అందువల్ల కాంగ్రెస్ లో వున్నారన్న మాటే కానీ, ఏ విధమైన ఏక్టివిటీ లేదు. పైగా ఆయన ఏ క్షణమైనా జనసేనలోకి జారిపోతారన్న వదంతులూ వున్నాయి.

అదీకాక కేటీఆర్ కు జనసేన పరోక్షంగా మద్దతు ఇచ్చిందన్న వార్తలు కూడా ఆ మధ్య ఎన్నికల్లో వినిపించింది. బహుశా అందుకే కావచ్చేమో, మెగా యువరాజు రామ్ చరణ్ ఫంక్షన్ కు, టీఆర్ఎస్ యువరాజు హాజరై, తమ తమ అనుబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన తరువాత కేటీఆర్ పాల్గొనే తొలి సినిమా సభ ఇదే. మొన్నటికి మొన్న ఓ ఫంక్షన్ లో ఎన్టీఆర్-కేటీఆర్ కలిసి సరదాలు, సందళ్లు చేసినట్లు వార్తలు వినవచ్చాయి. మొత్తంమీద చూస్తుంటే ఇండస్ట్రీలోని యాంటీ చంద్రబాబు జనాలు అంతా కేటీఆర్ తో బాగానే కలిసిపోతున్నట్లు కనిపిస్తోంది.

జగన్ కు ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ 

తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యం