సీనియర్ వంశీ కి ఓ అలవాటు వుంది. పాటలను కాన్సెప్ట్ లతో రకరకాలుగా చేయడం. అదే విధంగా పాటలను ఎలా చిత్రీకరించాలో ముందే ప్లాన్ చేసి, దానికి తగినట్లు ట్యూన్, మ్యూజిక్ చేయించడం. ఇప్పుడు అలాంటి పాట ఒకటి వచ్చింది. మైత్రీ మూవీస్ -సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ లో సానా బుచ్చిబాబు డైరక్షన్ లో నిర్మిస్తున్న ఉప్పెన సినిమా కోసం ఇలాంటి ప్రయోగం చేసారు.హార్డ్ బీట్ సౌండ్ లాంటి థడ్..థడ్..ను కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ థడ్..థడ్ సౌండ్ రకరకాలుగా పాటలో పిక్చరైజ్ చేసారు. సౌండ్ థడ్..థడ్ నే కానీ, దాన్ని బస్ హార్న్ లో, స్కూలు బెల్లులో, ఇలా రకరకాలుగా ప్రెజెంట్ చేసారు.
నువు నేను ఎదురైతే థడ్..థడ్..థడ్..మనసు..మనసు..మనసు దగ్గరయితే థడ్..థడ్..థడ్.. ఆశలు అలలై పొగుతుంటే థడ్..థడ్..థడ్..
ఇలా సాగుతుంది పాట మొత్తం. ఈ థడ్. ..థడ్..సౌండ్ వచ్చినపుడల్లా ఆ సౌండ్ రకరకాలుగా ప్రెంజెంట్ చేసారు. ఆఖరికి కోడి, కుక్క, పిట్ట, ఆవు అరుపుల్లో కూడా. చాన్నాళ్లయింది ఇలాంటి పాట వచ్చి. బహుశా ఇది దేవీశ్రీ ప్రసాద్ ఐడియానే అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు అతను రచనల్లో చేస్తుంటారు. ఇప్పుడు పిక్చరైజేషన్ లో చేసారు.
ఉప్పెన సినిమాలోంచి వచ్చిన తొలిపాట ' నా మనసు నీలి సముద్రం' జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ పాట వినడానికి, చూడ్డానికి కూడా బాగుంది.