వైసీపీ కొత్త ప్లాన్ .. ఫ్లాష్ సర్వే ద్వారా అభ్యర్ధుల ఎంపిక !

వైసీపీ అభ్యర్ధుల ఎంపిక అన్నది ఫ్లాష్ సర్వే ద్వారా చేస్తారట. అంటే ఎవరికి విజయావకాశాలు  ఉన్నాయో కచ్చితమైన సర్వే చేసి వారికే టికెట్లు ఇస్తారట. ఈ విధంగా చేయడం ద్వారా జనం మెచ్చిన నాయకుడికే…

వైసీపీ అభ్యర్ధుల ఎంపిక అన్నది ఫ్లాష్ సర్వే ద్వారా చేస్తారట. అంటే ఎవరికి విజయావకాశాలు  ఉన్నాయో కచ్చితమైన సర్వే చేసి వారికే టికెట్లు ఇస్తారట. ఈ విధంగా చేయడం ద్వారా జనం మెచ్చిన నాయకుడికే కుర్చీ దక్కుతుందని అంటున్నారు.

ముఖ్యంగా  మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో  ఈ విధానాన్ని వైసీపీ అమలు చేస్తోంది. విశాఖ నగరపాలన సంస్థ వంటి ప్రతిష్టాత్మకమైన నగరాల్లో కార్పోరేటర్ల ఎంపిక అన్నది ఫ్లాష్ విధానం ద్వారానే జరుగుతుందని పార్టీ నాయకులు అంటున్నారు.

దీనివల్ల కొంతమంది అభ్యర్ధులకు అవకాశాలు రాకుండా పోతాయన్న భయం ఉంది.  ఫ్లాష్ సర్వే నివేదికలు ఇపుడు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయట. అయితే కచ్చితంగా గెలుపు గుర్రాలను దించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధానం అమలు చేస్తున్నామని, దీని వల్ల ఎవరైనా టికెట్లు రాకుండా ఇబ్బంది పడితే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని కూడా పార్టీ పెద్దలు హామీ ఇస్తున్నారు.

విశాఖ మేయర్ సీటు మనదే, నూటికి నూరు శాతం కార్పోరేటర్లను గెలుచుకోవాలని కూడా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. మొత్తాని ఫ్లాష్ సర్వే ఏంటో, దాని నివేదిక ఏంటో అన్న టెన్షన్ మాత్రం ఫ్యాన్ పార్టీ నేతలకు పట్టుకుందని అంటున్నారు.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా