మీటూ.. సెటిల్‌మెంట్‌ జరిగిపోయిందా.?

'మీ..టూ..' ఉద్యమం ఓ ఊపు ఊపేసింది నిన్న మొన్నటిదాకా బాలీవుడ్‌లో. నానా పటేకర్‌ సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది. సాజిద్‌ ఖాన్‌ మీదా కేసులు నమోదయ్యాయి.. ఇంకా చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు మీ..టూ.. వివాదాల్లో ఇరుక్కున్నారు.…

'మీ..టూ..' ఉద్యమం ఓ ఊపు ఊపేసింది నిన్న మొన్నటిదాకా బాలీవుడ్‌లో. నానా పటేకర్‌ సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది. సాజిద్‌ ఖాన్‌ మీదా కేసులు నమోదయ్యాయి.. ఇంకా చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు మీ..టూ.. వివాదాల్లో ఇరుక్కున్నారు. కేంద్రమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఈ 'మీ..టూ..' కారణంగానే.!

ఏమయ్యిందో, ఒక్కసారిగా 'మీ..టూ..' ఉద్యమం చల్లబడిపోయింది. అనూహ్యంగా ఈ వివాదం ఇంతలా ముదరడానికి కారణమైన నటి తనూశ్రీ దత్తా విదేశాలకు వెళ్ళిపోయింది. ప్రాణం పోయినాసరే, నానా పటేకర్‌పై తాను చేసిన ఆరోపణల నుంచి వెనక్కి తగ్గేదిలేదని అప్పట్లో చెప్పిన తనూశ్రీ దత్తా విదేశాలకు వెళ్ళిపోవడమే కాదు, ఇప్పట్లో తాను ఇండియాకి వచ్చే అవకాశమూ లేదని సన్నిహితులకు చెప్పేసిందట.

అసలేం జరిగింది.? ఈ ప్రశ్నే ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఓ ప్రముఖ నిర్మాత రంగంలోకి దిగి నానా పటేకర్‌ – తనూశ్రీ దత్తా మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాడనీ, ఆ మధ్యవర్తిత్వం ఫలించి, డీల్‌ సెట్‌ అయ్యిందనీ, దాంతో తనూశ్రీ దత్తా కొన్నాళ్ళు విదేశాలకే పరిమితం కాబోతోందనీ బాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

తనూశ్రీ దత్తా, నానా పటేకర్‌ మీద ఫిర్యాదు చేయడం, నానా పటేకర్‌ పరువు నష్టం దావా వేయడం, ఆ తర్వాత రంగంలోకి రాఖీ సావంత్‌ దిగి, తనూశ్రీ దత్తాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆమె మీద తనూశ్రీ నోరు పారేసుకోవడం.. దాంతో, తనూశ్రీపై రాఖీ సావంత్‌ పరువునష్టం దావా వేయడం.. ఇలా చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి అప్పట్లో.

అంత జోరుగా సాగిన ఈ వివాదం, ఇంత షడెన్‌గా సైలెంట్‌ అయిపోవడం వెనుక చక్రంతిప్పిన ఆ పెద్ద నిర్మాత ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. నానా పటేకర్‌కి అత్యంత సన్నిహితుడట ఆ నిర్మాత. మేటర్‌ క్లియర్‌ అయ్యింది గనుక, నానా పటేకర్‌ తిరిగి సినిమాల్లో యాక్టివ్‌ అవడం లాంఛనమే.  

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

ఫెడరల్ ఫ్రంట్ రూపంలో కేసీఆర్, ఒవైసీ ఏపీలోకి! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్