హీరో కళ్యాణ్ రామ్ కు పక్కగా వర్కవుట్ అయిన జోనర్ ఏదీ అంటే యాక్షన్ థ్రిల్లర్ లే. యాక్షన్ కన్నా థ్రిల్లింగ్ సబ్జెక్ట్ లు బాగా సూటయ్యాయి అతనికి. ఆ మధ్య జోనర్ మారడం కోసం పటాస్ అంటూ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. తరువాత మళ్లీ అదే ధైర్యంతో లవ్, అండ్ రొమాంటిక్ జోనర్ ప్రయత్నించాడు. కానీ ఫలితం అంతగా బాగా రాలేదు.
ఇప్పుడు మళ్లీ తనదైన జోనర్ లో 118 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలయింది. హాయిగా సాగిపోయే జీవితంలో కుదుపు. ఆపై హీరో ఆ సమస్య నుంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నం అన్నది టీజర్ లో కనిపించిన కాన్సెప్ట్. సినిమాటోగ్రాఫర్ గా పేరున్న గుహాన్ ఇప్పుడు డైరక్టర్ గా మారారు. అందువల్ల టేకింగ్ లో వైవిధ్యం, రిచ్ నెస్ కనిపిస్తున్నాయి.
టీజర్ లో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే, కళ్యాణ్ రామ్ గెటప్, స్టయిల్ టెంపర్ లో ఎన్టీఆర్ లుక్స్ లో వుండడం. టీజర్ విడుదల సందర్భంగా వదిలిన స్టిల్ కూడా ఎన్టీఆర్ లుక్స్ స్టయిల్ లో వుండడం విశేషం.
సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్
పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్