వాస్తవానికి, ఊహకు తేడా తెలియకుండా బతికేస్తుంటారు కొంతమంది హీరోలు. 'ఎక్కడైనా మనం తోపు' అన్నట్టు వ్యవహరిస్తుంటారు. హీరో ధనుష్ ను కూడా ఈ కేటగిరీలో చెప్పుకోవాలేమో. కోలీవుడ్ లో ఇతడు పెద్ద హీరోనే. రజనీకాంత్ అల్లుడిగా, స్టార్ హీరోగా అతడికి ఇమేజ్ ఉంది. కానీ అదే ఇమేజ్ టాలీవుడ్ లో కూడా ఉందని భ్రమించడంతోనే ఇబ్బంది వస్తోంది.
తెలుగులో కూడా తనకు తిరుగులేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు ధనుష్. రఘువరన్ బీటెక్ అనే ఒకేఒక్క సినిమా ఇక్కడ ఆడినంత మాత్రాన మిగతా అన్ని సినిమాలు ఆడేస్తాయనే భ్రమలో ఉన్నాడు. అలా అనుకుంటే బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఇక్కడ సూపర్ స్టార్ అయిపోవాలి మరి. ఈ చిన్న లాజిక్ కు ధనుష్ మిస్ అవుతున్నాడు.
ఇక్కడ మేటర్ ఏంటంటే.. మారి-2 అనే సినిమా చేశాడు ఈ హీరో కమ్ నిర్మాత. తెలుగులో కూడా దీనికోసం బయ్యర్లు ఎదురుచూస్తున్నారనే రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడు. ఆకాశాన్నంటే రేట్లు చెబుతున్నాడు. చివరికి ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కు కూడా ఇతడు అమాంతం 5 కోట్ల రూపాయలు చెప్పడం విశేషం.
గతంలో కాలా సినిమా టైమ్ లో కూడా ఇలానే ప్రవర్తించాడు ధనుష్. రజనీకాంత్ ను హీరోగా పెట్టి, సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు భారీ రేట్లు చెప్పాడు. కట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇంత పెద్ద అనుభవం చవిచూసిన తర్వాత కూడా మారి-2 కోసం భారీ రేట్లు చెబుతున్నాడు ఈ హీరో. అది కూడా తెలుగులో.
నిజానికి తెలుగులో ధనుష్ కు అంత సీన్ లేదు. రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ నుంచి విశాల్, కమల్, సూర్య, కార్తి లాంటి హీరోలకు మాత్రమే కొద్దిగా మార్కెట్ ఉంది. ఇప్పుడిప్పుడే విజయ్ కూడా ఎంటరయ్యాడు. ఈ లిస్ట్ లో ధనుష్ ఇంకా చేరలేదు.
సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్
పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్