హరీష్ వేట మళ్లీ మొదలైంది

దువ్వాడ జగన్నాధమ్ సినిమా ఫేక్ కలెక్షన్ల దుమారం తరవాత ఇప్పటివరకు ఆ సినిమా డైరక్టర్ హరీష్ శంకర్ చేతికి సినిమా రాలేదు. ఎన్ని గ్యాసిప్ లు వచ్చినా, ఎన్ని ట్వీట్లువేసినా, ఎక్కడ వేసిన గొంగళి…

దువ్వాడ జగన్నాధమ్ సినిమా ఫేక్ కలెక్షన్ల దుమారం తరవాత ఇప్పటివరకు ఆ సినిమా డైరక్టర్ హరీష్ శంకర్ చేతికి సినిమా రాలేదు. ఎన్ని గ్యాసిప్ లు వచ్చినా, ఎన్ని ట్వీట్లువేసినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది వ్యవహారం. ఆఖరికి జిగర్తాండ సినిమాను మళ్లీ మరోసారి తెలుగులోకి అందించాలని అనుకున్నాడు. 14 రీల్స్ కు వరుణ్ తేజ్ ఓ సినిమా బాకీ వుండడం అన్నది హరీష్ శంకర్ కు కలిసివచ్చింది. ఆ విధంగా ఓ హీరో దొరికాడు మొత్తానికి.

కానీ మరో హీరో కావాలి. ఈ హీరో కన్నా ఓ మెట్టు కిందన వుండాలి. జనం దాదాపు మరచిపోయిన సిద్దార్థనే తీసుకువద్దాం అనుకున్నాడు. కానీ దానికి యూనిట్ లోనే చాలా అభ్యంతరాలు వచ్చినట్లు వార్తలు వచ్చేసాయి. దాంతో ఇక ఎవరు అని వెదుకులాట స్టార్ట్ చేసాడట.

సినిమాలు చేతిలో సరైనవి లేకుండా వెయిటింగ్ లో వున్న రాజ్ తరుణ్, నాగశౌర్య లాంటి పేర్లు పరిశీలనకు వస్తున్నాయట. అప్పుడు మల్టీ స్టారర్ ఎలా అవుతుంది. బరువు బ్యాలెన్స్ తేడా వస్తుందేమో అని మళ్లీ మరో మీమాంస. దాంతో కిందామీదా అవుతున్నాడట.

ఈలోగా వరుణ్ తేజ్ మరో హిట్ కొడితే, మొత్తం వ్యవహారం మళ్లీ మారిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే