cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'శుభలేఖలు' నలిగాయి

'శుభలేఖలు' నలిగాయి

చిన్న సినిమాలు తీయడం కన్నా మార్కెట్ చేయడం చాలాకష్టం. సోషల్ మీడియా దన్ను వుంటేనే చిన్న సినిమాలకు బజ్ వస్తుంది. మార్కెట్ వస్తుంది. కానీ అదే సోషల్ మీడియాను వదిలేస్తే సినిమా జనాలకు రీచ్ కాదు. ఈ మధ్య వచ్చిన శుభలేఖలు సినిమా ఫలితాన్ని సోషల్ మీడియా ఈ రెండు రకాలుగానూ ప్రభావితం చేయడం విశేషం.

కొత్త, చిన్న నటులతో తీసిన శుభలేఖలు సినిమాకు ఆరంభంలో మంచి ప్రమోషన్ చేసారు. టీజర్ కు, మిగిలిన పబ్లిసిటీ మెటీరియల్ కు సోషల్ మీడియా ద్వారా మంచి బజ్ తీసుకువచ్చారు. దాంతో ఆ సినిమాను అవుట్ రేట్ కు మరో నిర్మాత కొనేసుకున్నారు. ఆ విధంగా మంచి జరిగింది. పెట్టిన పెట్టుబడి, ప్లస్ లాభం వచ్చింది ఒరిజినల్ నిర్మాతకు.

కొన్న నిర్మాత పాపం, ప్రచారానికి బాగానే, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువే డబ్బులు ఖర్చు చేసారు. కానీ చేయాల్సిన విధంగా చేయలేకపోయారు. సంప్రదాయ పద్దతులలోనే వెళ్లారు. దాంతో సోషల్ మీడియాలో తేవాల్సిన బజ్ ను తీసుకురాలేకపోయారు. దాంతో సినిమాకు బాగుందని టాక్ వచ్చినా, జనాల్లోకి వెళ్లలేదు. దీంతో తొలివారమే దాదాపుగా సినిమా చాలాచోట్ల లేచిపోయింది.

సోషల్ మీడియా బజ్ తో సినిమా అమ్ముడుపోయింది. అదే సోషల్ మీడియాను వదిలేయడంతో సినిమా కుదేలయింది. మొత్తంమీద అవుట్ రేట్ కు సినిమా కొన్న నిర్మాతకు మూడు కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శాటిలైట్, డిజిటల్ ఏమయినా వస్తే కాస్త రికవరీ వుంటుంది.

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే 

 


×