ఇప్పటి వరకు సరైన బజ్ రాలేదు అంతరిక్షం సినిమా. విడుదల దగ్గరకు వచ్చేస్తోంది. అందుకే దానికి బజ్ తెచ్చేపని స్టార్ట్ చేసారు. ప్రచారం ముమ్మరం చేసారు. ప్రెస్ మీట్ లు, ఇంటర్వూలు సాగుతున్నాయి. అన్నింటికంటే కీలకంగా 18న ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు.
ఈ ఫంక్షన్ కు హీరో రామ్ చరణ్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఆయన కూడా ఓకె అన్నాడు. తమ్ముడు వరుణ్ తేజ్ అంటే రామ్ చరణ్ కు మొదటి నుంచీ అభిమానమే. ఫిదా సబ్జెక్ట్ తన దగ్గరకు వస్తే, వరుణ్ దగ్గరకు పంపించింది చరణ్ నే. అందుకే అంతరిక్షం సినిమాకు ఊపుతెచ్చే బాధ్యత కూడా తన మీద వేసుకుని, ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు.
డైరక్టర్ క్రిష్, ఆయన కోసం ఆయన సన్నిహిత సెలబ్రిటీలు, రామ్ చరణ్ వీళ్లంతా హాజరైతే ఆ ఫంక్షన్ తీరే వేరు. ఆపైన సినిమాకు వచ్చే బజ్ నే వేరు.
ఇదిలా ఉంటే 17 జరిగే పడి పడి లేచే మనసు సినిమా ఫంక్షన్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్టు గా వస్తున్నాడు