వారం దాటితే సినిమాకు వసూళ్లు రావనే విషయం తెలుసు. సూపర్ హిట్ అయితే తప్ప రెండోవారం ఆడదనే విషయం కూడా తెలుసు. అయినప్పటికీ తెగించి 2.O సినిమాను కొన్నారు. ఇప్పుడు నష్టాలు చవిచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఎట్టకేలకు 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
నిజానికి మొదటి 4 రోజుల్లోనే (గురువారం విడుదలైంది ఈ సినిమా) ఈ సినిమాకు 45 నుంచి 50 కోట్ల రూపాయల కలెక్షన్ ఆశించారు. కానీ అది మేజిక్ ఫిగర్ అందుకోవడానికి 16 రోజులు టైమ్ తీసుకుంది. బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే ఇంకా 22 కోట్లు రావాలి. ఇప్పటికే 2 వారాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా అదనంగా మరో 22 కోట్లు రాబట్టడం అసంభవం.
తెలుగులో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ తో కలిసి దిల్ రాజు, యూవీ వంశీ కొనుగోలు చేశారు. చాలా చోట్ల సొంత రిలీజ్ కు వెళ్లడంతో వీళ్లకు నష్టాలు తప్పలేదు. ఉన్నంతలో సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. నైజాంలో మాత్రం ఈ సినిమా ఎడ్జ్ లో గట్టెక్కబోతోంది. ఏపీ, నైజాంలో 2.O సినిమాకు 16 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 22.90 కోట్లు
సీడెడ్ – రూ. 7.19 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.35 కోట్లు
ఈస్ట్ – రూ. 3.65 కోట్లు
వెస్ట్ – రూ. 2.52 కోట్లు
గుంటూరు – రూ. 3.60 కోట్లు
కృష్ణా – రూ. 2.90 కోట్లు
నెల్లూరు – రూ. 1.87 కోట్లు