2 వేడుకలు.. ఇటు బన్నీ, అటు చెర్రీ

ఒకే రోజు థియేటర్లలోకి రాబోతున్నాయి అంతరిక్షం, పడి పడి లేచే మనసు సినిమాలు. సహజంగా వీటిలో మెగాహీరోల మద్దతు అంతరిక్షం సినిమాకే ఉంటుంది. ఎందుకంటే ఇది వరుణ్ తేజ్ నటించిన సినిమా కాబట్టి. కానీ…

ఒకే రోజు థియేటర్లలోకి రాబోతున్నాయి అంతరిక్షం, పడి పడి లేచే మనసు సినిమాలు. సహజంగా వీటిలో మెగాహీరోల మద్దతు అంతరిక్షం సినిమాకే ఉంటుంది. ఎందుకంటే ఇది వరుణ్ తేజ్ నటించిన సినిమా కాబట్టి. కానీ ఇక్కడ పరిస్థితి విభిన్నంగా ఉంది. రామ్ చరణ్ ఓ సినిమాకు, అల్లు అర్జున్ మరో సినిమాకు మద్దతిస్తున్నారు. 

వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 18వ తేదీన ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు. అలా ఈ సినిమాకు మరింత బజ్ తీసుకురాబోతున్నాడు చెర్రీ. 

అయితే అదే సమయంలో బన్నీ మరో సినిమా ఫంక్షన్ కు ఎటెండ్ కానున్నాడు. శర్వానంద్ హీరోగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ స్పెషల్ గెస్ట్ గా వెళ్తున్నాడు. ఎల్లుండి (17న) ఈ సినిమా ఫంక్షన్ శిల్పకళా వేదికలో జరగబోతోంది.

ఇలా ఒకే రోజు విడుదలవుతున్న 2 సినిమాలకు, ఇద్దరు మెగాహీరోలు విడివిడిగా ప్రచారం చేయబోతున్నారు. సెంటిమెంట్ ప్రకారం, బన్నీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న సినిమాలు ఈమధ్య హిట్ అవుతున్నాయి. శర్వా సినిమాకు ఆ పాజిటివ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.