‘శర్వా’కు కలిసి వస్తుందా?

ప్రేమించిన హీరోయిన్ నో, హీరోనో ప్రేమను, ప్రేమించిన వారిని మరిచిపోవడం అన్నది హిట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తో ఆ మధ్య సాయిధరమ్ తేజ… తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా చేసాడు.…

ప్రేమించిన హీరోయిన్ నో, హీరోనో ప్రేమను, ప్రేమించిన వారిని మరిచిపోవడం అన్నది హిట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తో ఆ మధ్య సాయిధరమ్ తేజ… తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా చేసాడు. కానీ కలిసి రాలేదు. నిన్నటికి నిన్న అనగనగా ఓ ప్రేమ కథ అనే సినిమా వచ్చింది. కొత్త హీరో, హీరోయిన్, కొత్త డైరక్టర్ కావడంతో పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఎలా వుంటుందన్నది ఇంకా తెలియాలి. 

ఇంచుమించు ఇదే లైన్ తో పడిపడి లేచే మనసు సినిమా కూడా రెడీ అవుతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ తేజ్ ఐ లవ్ యు, అనగనగా ఒక ప్రేమ కథ సినిమాలు ఇదే కాన్సెప్ట్ తో వస్తున్నాయని తెలిసి, దర్శకుడు హను రాఘవపూడి కాస్త మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. 

అవేంటీ అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు. మరి ఆ ఇద్దరికి కలిసి రాని కాన్సెప్ట్ శర్వాకు కలిసి వస్తుందేమో చూడాలి. ఇక్కడ అదృష్టం ఏమిటంటే, సాయిపల్లవి. సినిమా ఏమాత్రం బాగున్నా, ఆ అమ్మాయి లాక్కు వెళ్లిపోతుంది తన పెర్ ఫార్మెన్స్ తో. గతంలో నాని, వరుణ్ తేజ్ సినిమాలకు సాయిపల్లవే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. 

సాధారణంగా శర్వా సినిమాల్లో అతనే అట్రాక్షన్ అవుతాడు. అలాంటిది తొలిసారి సాయిపల్లవి శర్వాను డామినేట్ చేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. ఈ సినిమా మరో అయిదు రోజుల్లో జనం ముందుకు వస్తుంది.

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే