ఆ సమయంలో అమలతోనే 6 నెలలు – నాగార్జున

తన జీవితంలో అత్యద్భుతమైన క్షణాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు హీరో నాగార్జున. అఖిల్, అమల గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు తోడుగా గడిపిన క్షణాల్ని జీవితంలో మరిచిపోలేనన్నాడు. దాదాపు 30 ఏళ్ల కిందటి ఆ జ్ఞాపకాల్ని బయటపెట్టాడు.…

తన జీవితంలో అత్యద్భుతమైన క్షణాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు హీరో నాగార్జున. అఖిల్, అమల గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు తోడుగా గడిపిన క్షణాల్ని జీవితంలో మరిచిపోలేనన్నాడు. దాదాపు 30 ఏళ్ల కిందటి ఆ జ్ఞాపకాల్ని బయటపెట్టాడు.

“హలో బ్రదర్ షూటింగ్ అప్పుడే పూర్తయింది. అమల 9 నెలల గర్భంలో చివరి 6 నెలలు అమలకే కేటాయించాను. ప్రతి నిమిషం ఆమెతోనే ఉన్నాను. చివరికి డెలివరీ రూమ్ లో కూడా అమల చేయి పట్టుకొనే ఉన్నాను. నా జీవితంలో అది ఓ అరుదైన గొప్ప అనుభవం.”

ఇలా అఖిల్ పుట్టినప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు నాగ్. అమ్మతనం అనేది గొప్ప వరమని, ఆ టైమ్ లో వాళ్లకు అండగా ఉండడం అవసరం అన్నాడు.

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు నాగ్. ఈ కార్యక్రమంలో అమలకు సంబంధించిన ప్రశ్నను హీరో సోహెల్, నాగార్జునను అడిగాడు. అలా అఖిల్ పుట్టినప్పటి జ్ఞాపకాల్ని నాగార్జున బయటపెట్టాడు.

పురుషుడు గర్భం దాల్చడం అనే కొత్త కాన్సెప్ట్ తో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా వస్తుందని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు నాగ్. ఈ సినిమాకు సంబంధించి ఏడాదిన్నర కిందటే 10 నిమిషాల వీడియో చూశాడట. సినిమా కూడా చూస్తానని అప్పుడే మాటిచ్చాడట.