పైకి పెద్ద మనిషిలానే కనిపిస్తారు కొందరు. కానీ వాళ్ల అసలైన రూపం సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. హైదరాబాద్ కు చెందిన ఓ అకౌంటెంట్ అసలు రూపం కూడా ఇలానే బయటపడింది. మంచి ఉద్యోగం చేస్తూ, నలుగురిలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రబుద్ధుడు.. ఉదయం లేస్తే పక్కింటి బాత్రూమ్ లోకి తొంగిచూస్తూ కెమెరాతో ఆ సీన్లు షూట్ చేసేవాడు. ఎట్టకేలకు మేటర్ బయటపడింది
ఖమ్మంకు చెందిన ఫణీందర్ కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. కొండాపూర్ లోని ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి పెళ్లి కూడా అయింది. అయినప్పటికీ పక్కింటి ఆంటీపై కన్నేశాడు. తన ఇంటి రెయిలింగ్ ఎక్కి, పక్కింటి బాత్రూమ్ లోకి తొంగి చూసేవాడు. అక్కడితో ఆగకుండా తన సెల్ ఫోన్ తో ఆ దృశ్యాల్ని షూట్ చేసేవాడు.
అయితే ఫణీందర్ బండారం బయటపడింది. ఒక రోజు పక్కింటి మహిళ ఈ దుశ్చర్యను చూసింది. వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. అంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫణీందర్ ను అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు.
మొబైల్ నుంచి వీడియోల్ని డిలీట్ చేసినప్పటికీ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి వాటిని బ్యాకప్ చేసే సౌలభ్యం ఉంది. కాబట్టి ఫణీందర్ తప్పించుకోలేడు. ఏడాదిగా అతడు చేస్తున్న చెత్త పనికి శిక్ష తప్పదు.